ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Aug 27, 2020 , 23:20:21

హైవే వెంట ప్లాంటేషన్‌ పూర్తి చేయాలి

హైవే వెంట ప్లాంటేషన్‌ పూర్తి చేయాలి

  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

భువనగిరి కలెక్టరేట్‌ : జిల్లాలోని 65వ జాతీయ రహదారి వెంట మొక్కలు నాటాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తెలిపారు. గురువారం గూగుల్‌మీట్‌ ద్వారా జిల్లా అటవీశాఖ, జిల్లా పరిషత్‌ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి, బీబీనగర్‌ ఎంపీడీవో, ఎంపీవో, భువనగిరి మున్సిపల్‌ కమిషనర్‌, కొండమడుగు, బీబీనగర్‌ గ్రామాల సర్పంచులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. 65వ జాతీయ రహదారి వెంట ప్లాంటేషన్‌ పూర్తి స్థాయిలో చేపట్టేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు. కలుపు మొక్కలు తీసి, వాటరింగ్‌ వంటి చర్యలను నిరంతరాయంగా కొనసాగించాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.


VIDEOS

logo