గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 27, 2020 , 03:31:19

కరోనా వైద్య పరీక్షల శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

కరోనా వైద్య పరీక్షల శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

గుండాల : కరోనా మహమ్మారి గురించి ప్రజలు ఎలాంటి అపోహలు చెందవద్దని గ్రామాల్లో నిర్వహిస్తున్న కరోనా వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం మండలంలోని శాపూరం గ్రామంలో కరోనా వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాపూరంలో 52 మందికి కరోనా పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. గ్రామాల్లోని ప్రజలు కరోనా నివారణ కోసం తప్పనిసరిగా భౌతికదూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా వైద్య పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి పరీక్షలు చేస్తామన్నారు. 

VIDEOS

logo