ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Aug 27, 2020 , 07:05:51

నేడు ప్రభుత్వ విప్‌ రాక

నేడు ప్రభుత్వ విప్‌ రాక

ఆలేరు : యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు వాగుపై నిర్మించనున్న చెక్‌డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి గురువారం ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి రానున్నారని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

రాజాపేటలో..

రాజాపేట : పాడి పశువుల కృతిమ గర్భధారణ కార్యక్రమం ప్రారంభోత్సవానికి గురువారం మండలంలోని రేణికుంట గ్రామానికి ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి రానున్నారని మదర్‌డెయిరీ డైరెక్టర్‌ చింతలపూరి వెంకట్‌రాంరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు, పాడిరైతులు సకాలంలో హాజరు కావాలని కోరారు.


VIDEOS

logo