త్వరలో గొర్రెల పంపిణీ

భువనగిరి అర్బన్ : తెలంగాణ రాష్ర్టానికి ఊపిరిపోసిన ఉద్యమకారుడే ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన చేపపిల్లల వితరణ కార్యక్రమంలో భాగంగా భువనగిరి పట్టణ పరిధిలోని తీనం చెరువులో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌తో కలిసి 64వేల చేప పిల్లలను వితరణ చేశారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దూడల ప్రదర్శన, డెయిరీ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే దూడలకు మినరల్స్‌ను పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని సబ్బండ వర్గాలకు దేశంలో ఎక్కడాలేని విధంగా నిధులు కేటాయించి వారి అభివృద్ధికి దోహదపడుతున్నారని చెప్పారు. జీవాలపై ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. జీవాలకు హెల్త్ కార్డులు ప్రవేశపెట్టి, వ్యాక్సిన్ విధానంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. 2018లో మత్స్య కారులకు రూ. 900 కోట్లతో ద్విచక్ర వాహనాలు, చేపల విక్రయానికి ఆటోలు, ఇతర పనిముట్లను అందజేశామన్నారు. పాడి రైతులకు లీటరుకు రూ.4 ఇంటెన్సివ్ అందజేస్తున్నామన్నారు. ఇప్పటికే గొర్రెల పంపిణీ మొదటి విడత పూర్తయిందని, రెండో విడత త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలుస్తున్నారని చెప్పారు. దేశంలో వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల ఫ్లోరైడ్ కష్టాలు తీరాయన్నారు. యాదాద్రి ఆలయాన్ని రూ. వంద కోట్లతో చారిత్రకంగా తీర్చిదిద్దుతున్నది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు.
ఈ సమావేశంలో పశుసంవర్ధశాఖ అధికారి కృష్ణ, జిల్లా మత్స్యశాఖాధికారి షకీలాభాను, మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, నాయకులు పంగరెక్క స్వామి, గోమారి సుధాకర్‌రెడ్డి, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎన్ఎస్ఈలో లోపం ఊహించలేదు.. బట్ భారీ మూల్యం చెల్లించాం!
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల ఆదాయం!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్‌నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్‌తో సుకుమార్ సినిమా
- పెట్రోల్, డీజిల్‌లపై పన్నులకు కోత? అందుకేనా..!