సోమవారం 01 మార్చి 2021
Yadadri - Aug 25, 2020 , 00:40:20

ప్రజావాణి ఫిర్యాదులను... సత్వరమే పరిష్కరించాలి

  ప్రజావాణి ఫిర్యాదులను... సత్వరమే పరిష్కరించాలి

  కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ 

భువనగిరి కలెక్టరేట్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో 44 ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భువనగిరి మండలం నమాత్‌పల్లి గ్రామానికి చెందిన సర్వే నెంబర్‌ 73లోని భూమి ఆన్‌లైన్‌లో నమోదుపై తహశీల్దార్‌ చర్యలు తీసుకోవాలన్నారు. రామన్నపేట మండలం ఆసిఫ్‌నగర్‌ కాలువ పూడ్చి వేసేందుకు ఇరిగేషన్‌, తహశీల్దార్‌లు పనులు చేపట్టాలన్నారు. బీబీనగర్‌ మండలానికి చెందిన రాములుకు ఆసరా పెన్షన్‌ మంజూరు చేయాలని మండల అభివృద్ధి అధికారికి సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్లు డి.శ్రీనివాస్‌రెడ్డి, కీమ్యానాయక్‌, ప్రజావాణి సిబ్బంది పాల్గొన్నారు. 

VIDEOS

logo