శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 24, 2020 , 00:06:52

కరోనాతో మహిళ మృతి

కరోనాతో మహిళ మృతి

వలిగొండ: కరోనా సోకిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నర్సాపురం గ్రామంలో చోటుచేసుకున్నది. ఆదివారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ మహిళ(55) ఈ నెల 18న నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

మండలంలో మరో నలుగురికి కరోనా..

వలిగొండ మండలంలో శనివారం మరో నలుగురికి కరోనా సోకినట్లు డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 18 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వలిగొండ మండల కేంద్రానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు, వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 10 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అరూరు గ్రామానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.

సంస్థాన్‌నారాయణపురంలో ముగ్గురికి పాజిటివ్‌

సంస్థాన్‌నారాయణపురం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం 13 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యురాలు దీప్తీ తెలిపారు. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి హోంక్వారంటైన్‌ చేస్తామన్నారు.

VIDEOS

logo