నా కల నెరవేరింది

- డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో డీసీసీబీ చైర్మన్‌గా రైతులకు రూ.100 కోట్ల పంట రుణాలు ఇవ్వడం ద్వారా ఏన్నో ఏండ్ల నా కల నెరవేరిందని, ఆలేరు ప్రాంతవాసుల ఆశీర్వాదంతో ఇవన్నీ సాధ్యమయ్యాయని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరు పట్టణంలోని పీఏసీఎస్ చైర్మన్ గదిని ఆయన ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. - ఆలేరుటౌన్
ఆలేరు టౌన్ : సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో డీసీసీబీ చైర్మన్‌గా రైతులకు రూ.100 కోట్ల పంట రుణాలు ఇవ్వడం ద్వారా ఎన్నో ఏండ్ల నా కల నెరవేరిందని, ఆలేరు ప్రాంతవాసుల ఆశీర్వాదంతో ఇవన్నీ సాధ్యమయ్యాయని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరు పట్టణంలోని పీఏసీఎస్ చైర్మన్ చాంబర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు సీఎం కంకణం కట్టుకున్నారని, ఇందులో భాగంగానే నా బార్డు సహకారంతో రాష్ట్రంలోని పీఏసీఎస్‌లను బలోపేతం చేసేందుకు పెద్ద మొత్తంలో రైతులకు రుణాలు ఇస్తున్నామన్నారు.
రూ.100 కోట్లు మంజూరు..
పంట రుణాల కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రూ.100 కోట్ల మంజూరు చేసి రూ.95 కోట్లను 107 మంది రైతులకు అందజేశామని, మిగిలిన రూ.5 కోట్లను త్వరలో మిగతా వారికి అందజేస్తామని తెలిపారు. మరింత మంది రైతులు ముందుకు వస్తే అదనంగా రూ.20 కోట్ల రుణాలు ఇచ్చేందు కు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. 60 ఏండ్ల కాలంలో నల్లగొండ జిల్లాలో పంట రుణాలకు రూ.25 కోట్లు ఇచ్చిన చరిత్ర లేదని, డీసీసీబీ చైర్మన్‌గా ఆరు నెలల కాలంలోనే రూ. 120 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలోని 8 పీఏసీఎస్‌లకు రూ.17 కోట్లు మంజూరు కా గా, ఇప్పటికే రూ.16 కోట్ల 10 లక్షలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు.
ఆలేరు పీఏసీఎస్‌లో 534 మందికి రూ.2కోట్ల 32లక్షలను అందజేసినట్లు తెలిపారు. వ్యవసా య అనుబంధ పరిశ్రమలైన కోళ్ల ఫాంలు, గొర్రెల పెంపకానికి నాబార్డు ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటివర కు రూ.5 కోట్లు మంజూరు కాగా, ఎస్సీ, ఎస్టీలకు 33 శాతం, బీసీ, ఓసీలకు 25 శాతంతో 76 మందికి రూ.2 కోట్ల 65 లక్షల, 50 వేలను డీసీసీబీ ద్వారా అందించామన్నారు. ఆలే రు నియోజకవర్గంలో 10 మందికి రూ.43లక్షల 94 వేలను అందించామని తెలిపారు. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోటి రూపాయలను ఇవ్వడమే గగనంగా ఉండేదన్నారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చిన నాటి నుంచే రైతుల కష్టాలు తీరాయన్నారు. గ్రామస్థాయిలో పెద్ద మొత్తం లో గోదాంల నిర్మాణానికి 25 శాతంతో కూడిన రుణాలు ఇ వ్వనున్నట్లు తెలిపారు. దేశానికి ధాన్యగారంగా తెలంగాణ అవతరించిందని,
ఈ ఏడాది 65 శాతం ధాన్యం ఉత్పత్తి జరిగిందని, ఇప్పటికే ఉన్న గోదాంలల్లో ధాన్యం నిండిపోవడం తో మరో 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గోదాంల నిర్మాణానికి 25 శాతం సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీవో వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశం, వైస్ చైర్పర్సన్ చింతకింది చం ద్రకళామురహరి, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకర య్య, పీఏసీఎస్ మేనేజర్ షరీఫ్, సీఈవో వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాధవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్, పీఏసీఎస్ డైరెక్టర్లు సాగర్‌రెడ్డి, నర్సింహులు, సుందర్నాయక్, స్వామి, భిక్షపతి, కృష్ణంరాజు, లక్ష్మి, అంజయ్య, సిద్ధులు, మల్లేశం, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు భాను, అంజన్‌కుమార్, కిష్టయ్య, ఆంజనేయులు ఉన్నారు.
తాజావార్తలు
- ప్రిన్స్ సల్మాన్ ఆదేశాల ప్రకారమే జర్నలిస్టు ఖషోగ్గి హత్య
- అతివేగం, మద్యంమత్తుకు మరో ప్రాణం బలి
- ఎన్టీఆర్ మాస్క్‌పై చర్చ.. ధర తెలుసుకొని షాక్..!
- చైనా వ్యాక్సిన్‌ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం