ఏకదంతుడే

- ఊరికొక్కటే మట్టివినాయకుడు
- ఏకతాటిపైకి వస్తున్న గ్రామస్తులు
- సర్పంచ్ల సమక్షంలో ఏకగ్రీవ తీర్మానాలు
- కరోనా వ్యాప్తి నివారణ కోసమే నిర్ణయం
చౌటుప్పల్ రూరల్: వినాయక నవరాత్రుల్లో భాగంగా వాడవాడలా గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంతో ఇది అనుకూలం కాదని ఆగ్రామస్తులు తరించారు. అన్ని పార్టీలు ఏకమయ్యాయి. ప్రస్తుత పరిస్థితులను చర్చించారు. ఇంకేముంది ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామపెద్దల సమక్షంలో తీర్మానించారు. ఒక వైవు ఆరోగ్యం.. మరో వైవు పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ ఆ గ్రామస్తులు పలువురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చౌటుప్పల్ మండలం పెద్దకొండూర్‌లో గ్రామస్తులంతా ఏకమయ్యారు. కొవిడ్ జాగ్రత్తల్లో భాగంగా గ్రామంలో ఒకే వినాయకుడిని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అదికూడా మట్టి వినాయకుడి ప్రతిష్ఠించాలని సంకల్పించారు. దీంతో గ్రామంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ తరవున విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో కరోనాను కట్టిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ పర్యావరణ రహితమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
కరోనా కట్టడికి తీర్మానం
కరోనా కట్టడిలో భాగంగా వినాయక ఉత్సవాలకు సంబంధించి అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాం. గ్రామంలో ఒక విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని తీర్మానం చేశాం. మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తే పర్యావరణ పరిరక్షణకు కూడా బాగుంటుందని చర్చించాం. దీంతో మట్టి వినాయకుడిని నెలకొల్పుతున్నాం.
-కాయితీ రమేశ్‌గౌడ్, పెద్దకొండూర్ సర్పంచ్, చౌటుప్పల్ మండలం
తాజావార్తలు
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- జీడీపీలో అసోం వాటా పెరిగేవరకూ అలసట లేని పోరు : అమిత్ షా
- నా మీటింగ్‌కు అనుమతి ఇవ్వడం లేదు..
- స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్
- బెస్ట్ ఐటీ మినిస్టర్‌గా కేటీఆర్
- వాట్సాప్‌లో నెలకు ఎన్ని మేసెజ్‌లు వెళ్తాయో తెలుసా?
- మన ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తినే గెలిపించుకుందాం
- గన్‌పౌడర్ తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల రైడ్
- సోషల్ మీడియాకు కొత్త మార్గదర్శకాలు ప్రకటించిన కేంద్రం
- ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా..స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్