బుధవారం 21 అక్టోబర్ 2020
Yadadri - Aug 22, 2020 , 00:07:50

మ‌ట్టి గ‌ణ‌ప‌తుల‌నే పూజించాలి

మ‌ట్టి గ‌ణ‌ప‌తుల‌నే పూజించాలి

యాదాద్రి, నమస్తేతెలంగాణ: మట్టి గణపతులను ప్రతిష్ఠించుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలని అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌ సూచించారు. ఎమ్మెల్యే సునీతామహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారాంచంద్రన్‌  సూచనల మేరకు శుక్రవారం యాదగిరిగుట్ట మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఆయన మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.   ఇదిలా ఉండగా యాదగిరిగుట్టలో  మున్సిపల్‌ కమిషనర్‌ జంపాల రజిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుధా హేమేందర్‌గౌడ్‌,   కౌన్సిలర్లు తాళ్లపల్లి నాగరాజు,  టీఆర్‌ఎస్‌ నాయకులు హేమేందర్‌, కార్పొరేటర్‌ తాళ్లపల్లి నాగరాజు  పాల్గొన్నారు.

 పర్యావరణ పరిరక్షణకోసం..

భువనగిరి అర్బన్‌: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పూజించాలని మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు.  మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అందజేసిన మట్టి విగ్రహాలను ఆయన పట్టణంలోని పాత మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, కమిషనర్‌ వంశీకృష్ణ, కౌన్సిలర్లు ఏవీ.కిరణ్‌కుమార్‌రెడ్డి, గోమారి సుధాకర్‌రెడ్డి, జిట్టా వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు చెన్న మహేశ్‌, గంటెపాక జంగయ్య, శ్రీనివాస్‌, పాండు పాల్గొన్నారు. 

భువనగిరిలో..

పట్టణంలోని 19వ వార్డు ప్రజలకు ఆవార్డు కౌన్సిలర్‌ వడిచెర్ల లక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ,  శ్రీనివాస్‌, యాదగిరి, సాయి పాల్గొన్నారు.

మట్టి విగ్రహాల పంపిణీ 

వలిగొండ: మండల కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త చీకటిమల్ల వెంకటేశం సౌజన్యంతో పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక చవితి పర్వదినం సందర్భంగా మట్టి వినాయకులను మండలంలోని ఆర్యవైశ్యులకు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, సభ్యులు రమేశ్‌, అప్పిశెట్టి సంతోష్‌, నువ్వుల శ్రీను, శివకుమార్‌, హరిబాబు  పాల్గొన్నారు. 


logo