శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 21, 2020 , 00:10:07

శాస్ర్తోక్తంగా నిత్యపూజలు

శాస్ర్తోక్తంగా నిత్యపూజలు

యదాద్రి, నమస్తే తెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం నిత్యపూజలు ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయంలో సుప్రభాతసేవ చేసిన అనంతరం బాలాలయంలో ప్రతిష్ఠమూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. వివిధ పుష్పాలతో స్వామి, అమ్మవార్లను అందంగా అలంకరించారు. మంటపంలో శ్రీ సుదర్శన నారసింహహోమం, నిత్య కల్యాణ వేడుకలు వైభవంగా జరిపారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు నివేదన జరిపించి, శయనోత్సవం చేపట్టారు.

తగ్గిన ‘శ్రావణ’ ఆదాయం..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈ ఏడాది శ్రావణ మాసంలో భారీగా ఆదాయం తగ్గింది. ఈసారి శ్రావణ మాసంలో రూ.1,44,92,967 ఆదాయం వచ్చింది. కాగా, గతేడాది .5,78,64,823 ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే రూ.4,33,71,856 ఆదాయం తక్కువగా వచ్చింది. కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ సారి ఆర్జిత సేవలు రద్దు చేశారు. అలాగే కరోనా భయంతో భక్తుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. దీంతో వివిధ సేవల ద్వారా స్వామి వారికి వచ్చే ఆదాయం భారీగా తగ్గినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. ఈసారి శ్రావణ మాసంలో ప్రసాద విక్రయాలతో రూ.54,81,475, శాశ్వత పూజల ద్వారా రూ.79,044, ఇతర సేవల  ద్వారా రూ.89,32,448 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు పేర్కొన్నారు.


VIDEOS

logo