ఆదివారం 29 నవంబర్ 2020
Yadadri - Aug 20, 2020 , 01:09:22

రేపటి నుంచి భువనగిరిలో ఐసొలేషన్‌ సేవలు

రేపటి నుంచి భువనగిరిలో ఐసొలేషన్‌ సేవలు

  • ఏరియా ఆస్పత్రిలో పూర్తయిన ఏర్పాట్లు 
  • l 40 పడకలు, వెంటిలేటర్లు,ఆక్సిజన్‌ సిలిండర్లు సిద్ధం 
  • l కరోనా బాధితులకు కషాయం, డ్రైఫ్రూట్స్‌, బలవర్థక ఆహారం 
  • l అందుబాటులో అంబులెన్స్‌ సిద్ధం 
  • l ఏర్పాట్లు పరిశీలించిన  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి 

భువనగిరి అర్బన్‌: భువనగిరి ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేస్తున్న ఐసొలేషన్‌ వార్డు శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే పైళ్ల   శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరి ఏరియా దవాఖానలో సొంత నిధులు రూ.50లక్షలతో కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న 40 పడకల ఐసొలేషన్‌ వార్డులో జరుగుతున్న పనులను  బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డులో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి సాంబశివరావుకు సూచించారు. చికిత్స నిమిత్తం వచ్చిన బాధితులకు రోగనిరోధక శక్తిని పెంచే కషాయం, కాజు, కిస్మిస్‌, బాదం, పండ్లు, జ్యూస్‌, పౌష్టికాహారం అందుబాటులో ఉంటుందని, వారికి  ఎప్పటికప్పుడు అందేలా చూడాలన్నారు.  ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్ర టిఫిన్‌, స్నాక్స్‌, పండ్లు, జ్యూస్‌ను అందించే విధంగా  చర్యలు తీసుకోవాలన్నారు. వార్డులో ఏర్పాటు చేస్తున్న పడకలు, వాటికి అమర్చే ఆక్సిజన్‌ సిలిండర్లు, వేడినీరు, బెడ్‌షీట్లు మార్చడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వైద్యం కోసం వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని  సూచించారు. ప్రత్యేక డాక్టర్లు, శానిటేషన్‌ సిబ్బంది, వార్డులో పనిచేసే వర్కర్లు ఇప్పటికే దవాఖానకు చేరుకున్నారని చెప్పారు. వ్యాధి పూర్తిగా తగ్గిన తర్వాత ఇంటి వరకు వదిలిపెట్టడానికి ప్రత్యేక అంబులెన్స్‌ అందుబాటులో ఉంచాలన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ కిష్టయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ పరమేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నక్కల చిరంజీవి,  సూపరింటెండెంట్‌ రవికుమార్‌, కౌన్సిలర్లు కిరణ్‌కుమార్‌, దిడ్డికాడి భగత్‌, పంగరెక్క స్వామి, అందె శంకర్‌, ఖాజా అజీముద్దీన్‌, కోఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ అప్జల్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ అబ్బగాని వెంకట్‌, నాయకులు ఎడ్ల రాజేందర్‌రెడ్డి, ఇక్బాల్‌ చౌదరి, ఇట్టబోయిన గోపాల్‌, భాషబోయిన రాజేశ్‌ పాల్గొన్నారు.