మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Aug 20, 2020 , 01:10:56

‘దోస్త్‌' హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

‘దోస్త్‌' హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

ఆలేరు టౌన్‌ : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ‘దోస్త్‌' హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్‌ డా. సీహెచ్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం పట్టణకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. కళాశాల రాష్ట్ర కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో దోస్త్‌ 2020 నోటిఫికేషన్‌ సందర్భంగా విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని తెలిపారన్నారు. తరగతుల సందర్భంగా కొవిడ్‌-19 నిబంధనల మేరకు విద్యార్థులపై సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి ట్రైనింగ్‌ నిర్వహించారని సూచించినట్లు తెలిపారు. వి ద్యార్థులు దోస్త్‌ హెల్ప్‌లైన్‌ నెం.9550633401, 986 6416969 లకు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ‘దోస్త్‌' టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉపేంద్ర, రేవంత్‌ ఉన్నారు.

VIDEOS

logo