శనివారం 06 మార్చి 2021
Yadadri - Aug 18, 2020 , 00:01:54

వర్షానికి దెబ్బతిన్న ఇండ్లు

వర్షానికి దెబ్బతిన్న ఇండ్లు

తుర్కపల్లి /చౌటుప్పల్‌ రూరల్‌ / అడ్డగూడూరు / ఆత్మకూరు(ఎం) / వలిగొండ/ భూదాన్‌ పోచంపల్లి : ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని పలు గ్రామాల్లో ఇండ్లు సోమవారం దెబ్బతిన్నాయి. తుర్కపల్లి మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన మేడి బాలకిషన్‌ పెంకుటిళ్లు, చోక్లాతండాకు చెందిన బూక్యా యాదమ్మకు చెందిన ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చౌటుప్పల్‌ మండలంలో23 ఇండ్లు పాక్షికంగా, 4 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రెవెన్యూ అధికారులు వాటి వివరాలను సేకరిస్తున్నారు. అడ్డగూడూరు మండలంలోని చౌళ్లరామారం గ్రామానికి చెందిన బాల్నె లింగయ్య ఇల్లు కూలిపోయింది. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంతో పాటు ఉప్పలపహాడ్‌లో రెండు పెంకుటిండ్లు పాక్షికంగా కూలి పోవడంతో తహసీల్దార్‌ జ్యోతి పరిశీలించారు. వలిగొండ మండలంలో 4 ఇండ్లు పాక్షికంగా కూలినట్లు మండల తహసీల్దార్‌ నాగలక్ష్మి తెలిపారు. వెల్వర్తిలో 3, పులిగిల్ల ఒక ఇల్లు కూలినట్లు తెలిపారు.భూదాన్‌ పోచంపల్లి మండల వ్యాప్తంగా ముసురుకు సుమారు 11 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తహసీల్దారు గుగులోతు ధశరథ నాయక్‌ తెలిపారు.

VIDEOS

logo