జీవ వైవిధ్య నిలయం

- l కనుమరుగైపోతున్న జీవరాశులకు పునర్జీవం
- l జిల్లాలో కనువిందు చేస్తున్న అటవీ అందాలు
- l నరసింహ, ఆంజనేయ అభరణ్యాలలో జింకల గంతులు
- l రాచకొండలో పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్లు
- l గోదావరి జలాలతో చెరువుల్లోకి చేరిన సముద్రపు చేపపిల్లలు
- l మృగశిర కార్తెలోనే దర్శనమిచ్చిన ఆరుద్ర పురుగులు
పచ్చిక బయళ్లు.. చెట్లు చేమలు.. కొండలు.. గుట్టలు.. వాగులు.. వంకలు.. విభిన్న జీవరాశులు... ఇలా ప్రకృతిలోని అందాలన్నీ జీవ వైవిధ్యానికి ప్రతిబింబాలే. నిన్నమొన్నటి వరకు ఆధ్యాత్మికతకు కేరాఫ్‌గా నిలిచిన జిల్లా నేడు జీవ వైవిధ్యానికీ నిలయంగా నిలుస్తోంది. హరితహారం, మిషన్‌కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు జీవ వైవిధ్య పరిరక్షణకు దోహదపడ్డాయి. ఫలితంగా.. అడవుల్లో జంతువులు, చెరువుల్లో సముద్రపు చేపలు సాక్షాత్కరిస్తున్నాయి. రాజాపేట, మోత్కూరు ప్రాంతాలకు సైబీరియన్ కొంగలు వలసవచ్చి కనువిందు చేస్తున్నాయి. జింక పిల్లల గంతులు.. పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్ల హొయలు.. చిన్నప్పుడు ఆటవిడుపుగా ఉన్న రింగన్నలు.. వంటి అద్భుతమైన జీవ వైవిధ్యంతో నేడు జిల్లా అలరారుతోంది.
- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో జీవ వైవిధ్యం వెల్లివిరుస్తోంది. వివిధ జాతుల వన్య ప్రాణులు, క్రిమీ కీటకాలు, పక్షులు తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. జింకలు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, నెమళ్లు, కొండముచ్చులు తదితర ఎన్నో జంతువుల సంచారంతోపాటు పక్షుల కిలకిలరావాలతో గడచిన ఐదేండ్లలో అడవుల అందం మరింత పెరిగింది. వేసవిలో వివిధ రకాల వన్యప్రాణులు, పక్షులు నీటి కుంటలు, చెరువుల వద్దకు వచ్చి దాహార్తిని తీర్చుకున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. జిల్లాలో 12వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. ప్రతి యేటా హరితహారంలో విరివిగా మొక్కలు నాటుతున్నారు. ఇప్పటివరకు రూ.20 లక్షలకు పైగా మొక్కలు నాటడంతో అడవుల్లో పచ్చదనం మరింత పెరిగింది. దీనికితోడు జీర్ణావస్థకు చేరిన చెరువులు సైతం మిషన్ కాకతీయ పథకంలో బాగుపడ్డాయి. దీనికి వర్షాలు సైతం సమృద్ధిగా పడటంతో ఎక్కడ చూసినా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. ఈ చర్యల వల్ల జిల్లా జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
తొలకరి వర్షాలకు దర్శనమిచ్చిన ఆరుద్ర పురుగులు
వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైంది. ఈ కార్తెలో మాత్రమే ఆరు ద్ర పురుగు పంటపొలాల్లో కనిపిస్తుంటుంది. అయితే విచ్చలవిడిగా ఎరువులు, రసాయనాలు వాడకం వల్ల ఆరుద్ర పురుగుల ఉనికికే ప్రమా దం ఏర్పడింది. ఈ ఏడాది తొలకరి వర్షాలకే ఆరుద్ర పురుగులు జిల్లాలో అక్కడక్కడా పొలా ల్లో దర్శనమిచ్చాయి. ఆరుద్ర కార్తెకు ముందుగానే అంటే మృగశిర కార్తెలోనే కనిపించి కనువిందు చేశాయి. ఆరుద్ర పురుగుల ఆగమనాన్ని రైతులు శుభసూచకంగా భావిస్తారు. ఈసారి పొలాల్లో బిలబిలమంటూ కుప్పలు కుప్పలుగా ఆరుద్ర పురుగులు కనువిందు చేయడంతో ఇక వర్షాలకు కొదవే ఉండదని, వ్యవసాయ పనులను మొదలుపెట్టుకోవచ్చంటూ రైతులు ఆనందపడ్డారు. సంతోషంతో పంటల సాగుకు ఉపక్రమించారు.
జీవరాశులతో అడవులకే అందం
పచ్చదనం పెంపుదలలో ముందంజలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం జీవ వైవిధ్యంపైనా దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా అడవుల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇస్తుండగా ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఎకరం ఖాళీ స్థలంలో దట్టంగా చెట్లు పెంచేందుకు యాదాద్రి న్యాచురల్ ఫారెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రోగ్రాంను అందుబాటులోకి తెచ్చింది. పూలు, పండ్ల మొక్కలను ఒకేచోట పెంచి జీవ వైవిధ్యానికి నిలయాలుగా మార్చింది. దీంతో యాదాద్రి మోడల్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చిట్ట
అడవులను సృష్టించేందుకు తెలంగాణ ప్రభు త్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చాలాచోట్ల చిట్టడవులు తయారవ్వగా.. ప్రయోగాత్మకంగా చేపట్టిన చౌటుప్పల్‌లోని తంగేడువనం జీవ వైవిధ్యానికి కేరాఫ్‌గా నిలుస్తోంది. ఒకప్పుడు అంతరించిపోయాయనుకున్న ఎన్నో రకాల పిచ్చుకలకు చెందిన గూళ్లు, క్రిమీ కీటకాలు కనిపిస్తున్నాయి. సీతాకోక చిలుకలు, నెమళ్లు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా జిల్లాలోని నరసింహా అభయారణ్యం, ఆంజనేయస్వామి అభయారణ్యం వంటి ఎన్నో చిట్టడవులు జీవరాశులతో కొత్త అందాలను సంతరించుకున్నాయి.
సైబీరియన్ పక్షుల సందడి
విదేశీ పక్షులకు జిల్లా ఆతిథ్యమిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండేళ్లుగా ఈ ప్రాంతానికి విదేశీ పక్షలు వలస వస్తున్నాయి. రాజాపేట మండలంలోని బొందుగుల చెరువు ప్రాంతానికి గత మే నెలలో వచ్చిన సైబీరియన్‌కు చెందిన కొంగలు సందడి చేశాయి. ఖండాలు దాటి .. సుమారు 5వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి చేరుకున్నాయి. తాజాగా మోత్కూరు చెరువు వద్ద ఈ తరహా కొంగలు కనిపిస్తున్నాయి. నీటి అలలపై తేలి ఆడుతూ ఆహారంగా చేపపిల్లలను వేటాడే దృశ్యాలు స్థానికులను కనువిందు చేస్తున్నాయి. వీటిని తిలకించేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సంస్థాన్‌నారాయణపురం, బీబీనగర్, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూరు తదితర ప్రాంతాల్లో జింకలు, నెమళ్లు, రింగన్నలు, ఎండ్రకాయలు తదితక ఎన్నో రకాల జీవరాశులు పంట పొలాల నడుమ దర్శనమిచ్చి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
తాజావార్తలు
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
- ‘సారస్వత’ పురస్కారాలకు 10 వరకు గడువు
- కాళేశ్వరంలో నేడు శ్రీవారి చక్రస్నానం