గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 18, 2020 , 00:02:23

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

భువనగిరి కలెక్టరేట్‌:  ప్రజావాణి ఫిర్యాదులను  వెంటనే పరిష్కరించాలని  కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో భాగంగా ఫోన్‌ ఇన్‌ ద్వారా ఆమె 30 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ... ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి అర్హులకు న్యాయం చేయాలన్నారు. వలిగొండ మండలం చిట్టాపూర్‌లోని ప్రభుత్వ భూమిని డంపింగ్‌ యార్డు, విలేజ్‌ పార్కు ఏర్పాటుపై సంబంధించిన తహసీల్దార్‌ చర్యలు చేపట్టాలని, భువనగిరి మండలం నమాత్‌పల్లికి చెందిన గ్రామకంఠం భూమిపై డీపీ వో చర్యలు తీసుకోవాలని, సంస్థాన్‌నారాయణపురం మండల పరిధిలో రోడ్ల ఏర్పాటు అవకతవకలపై చర్యలు తీసుకోవాలన్నారు. చౌటుప్పల్‌కు చెందిన లక్ష్మమ్మకు వృద్ధాప్య పింఛన్‌ కోసం ఎండీవో, డీఆర్‌డీఏ, పౌతి, విరాసత్‌ భూ సంబంధిత వివరాలపై రెవెన్యూ అధికారులు, భువనగిరి మండలం నమాత్‌పల్లి చెరువుశిఖం కబ్జాపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ జ్యోతి పాల్గొన్నారు.

VIDEOS

logo