శుక్రవారం 30 అక్టోబర్ 2020
Yadadri - Aug 17, 2020 , 00:26:11

జన్మదిన సంబురం

జన్మదిన సంబురం

  • ఘనంగా ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత పుట్టినరోజు వేడుకలు 
  • కేకుల కోతలు, ఆలయాల్లో పూజలు 
  • పేదలకు, అనాథలకు అన్నదానాలు 
  • lప్రభుత్వ విప్‌ దంపతులకు శుభాకాంక్షలు 
  • తెలిపిన సీఎం కేసీఆర్‌, గవర్నర్‌  బండారు దత్తాత్రేయ
  • సాగుజలాల సాధనే అంతిమ లక్ష్యమన్న ఎమ్మెల్యే సునీత 
  • ఎంపీ సంతోష్‌ గ్రీన్‌ చాలెంజ్‌, మూడు మొక్కలు నాటిన ఎమ్మెల్యే 


యాదాద్రి, నమస్తేతెలంగాణ : ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 11:00 గంటలకు డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం అందించారు. అనంతరం నేరుగా కొండ కింద స్వామివారి పాదాల వద్ద టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి చైర్‌పర్సన్‌ సుధాహేమేందర్‌, కౌన్సిలర్లతో కలిసి స్వచ్ఛ ఆటోలు ప్రారంభించారు. అక్కడ కేక్‌ కట్‌ చేసి నాయకులు, కార్యకర్తలు, కార్మికులకు అందజేశారు. అనంతరం గుట్టలోని వారి స్వగృహంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. 

స్వామి దయతో కరోనా అంతం కావాలి..

యాదాద్రి లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న అనంతరం ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ లక్ష్మీనరసింహుడి దయతో కరోనా అంతం కావాలని స్వామి వారిని కోరుకున్నుట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు గడ్డమీది రవీందర్‌గౌడ్‌, జడ్పీటీసీ సభ్యురాలు అనూరాధబీరయ్య, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సుధాహేమేందర్‌, వైస్‌చైర్మన్‌ రాజు, కౌన్సిలర్లు నాగరాజు, మమత, టీఆర్‌ఎస్‌ అధ్యక్షడు ఆంజనేయులు, నాయకులు హేమేందర్‌, నర్సింహ, వెంకటయ్య, సాయి, అనిల్‌ పాల్గొన్నారు.

కొవిడ్‌-19 నిబంధలు పాటిస్తూ..

ఆలేరు : ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి జన్మదినాన్ని యాదగిరిగుట్ట పట్టణంలోని పలు ప్రాంతాల్లోపాటు మాసాయిపేట, వంగపల్లి గ్రామాల్లో పలువురు నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలోని వారి స్వగృహంలో భారీ కేక్‌ కట్‌ చేసి పలువురికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ విప్‌నకు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఏడీఏల్‌ చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి, మైలారిగూడెం ఉప సర్పంచ్‌ మారెడ్డి కొండల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వంటేరు సురేశ్‌రెడ్డి, మదర్‌డెయిరీ డైరెక్టర్‌ శ్రీశైలం, ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు స్వామి, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు..

మైలారిగూడెం ఉప సర్పంచ్‌ మారెడ్డి కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. యాదగిరిగుట్ట పట్టణంలో గొంగిడి నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో కొండల్‌రెడ్డి పాల్గొని ప్రభుత్వ విప్‌ దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం వారి చిత్రపటాన్ని బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా స్పెక్ట్రా ఇండియా హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ జగన్‌ ప్రభుత్వ విప్‌నకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

రాజాపేటలో..

రాజాపేట : మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రభుత్వ విప్‌ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి పలువురికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, ఎంపీపీ బాలమణీయాదగిరిగౌడ్‌, జడ్పీటీసీ గోపాల్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, సీసీ బ్యాంక్‌ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, మదర్‌డెయిరీ డైరెక్టర్‌ గాల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌, మాజీ జడ్పీటీసీ భిక్షపతిగౌడ్‌, సర్పంచ్‌ ఈశ్వరమ్మాశ్రీశైలం, నాయకులు కరీం, కనకరాజు, సత్యనారాయణ, విష్ణు, సిద్ధులు, సంతోశ్‌గౌడ్‌, నర్సింహులు, రమేశ్‌, జశ్వంత్‌, రాములునాయక్‌, వెంకటయ్య, నరేందర్‌, స్వామి, తిరుమలేశ్‌, సిద్ధులు, స్వామి, మహేందర్‌గౌడ్‌, శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం..

ఆలేరుటౌన్‌ : ప్రభుత్వవిప్‌ జన్మదినాన్ని పట్టణంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్‌ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్‌ఎస్‌, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా 33 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ మాధవి, కౌన్సిలర్లు జె.శ్రీకాంత్‌, కె.శ్రీకాంత్‌, నర్సింహులు, రాములు, ఎం.సునీతారమణారెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యులు ఎండీ రియాజ్‌, లత, రాజేశ్‌, నాయకులు అంజన్‌కుమార్‌, శివకుమార్‌, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు డా.ప్రభాకర్‌, కార్యదర్శి మురహరి, జీవన్‌జ్యోతి బ్లడ్‌బ్యాంకు వైద్యుడు రంజిత్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు ప్రకాశ్‌, రాంచందర్‌ తదితరులు ఉన్నారు.

నిరాడంబరంగా..

ఆత్మకూరు(ఎం) : ప్రభుత్వ విప్‌ జన్మదినాన్ని మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి ప్రభుత్వ విప్‌నుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఎల్‌డీఏ చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఉప్పలయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ స్వాతి, ఎంపీటీసీ కవిత, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్‌గౌడ్‌, రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, అక్బర్‌, జిల్లా నాయకులు రమేశ్‌గౌడ్‌, ఇంద్రారెడ్డి, చందర్‌గౌడ్‌, ధనలక్ష్మి, యువజన విభాగం మండల అధ్యక్షుడు శేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు పూలమ్మ, దశరథగౌడ్‌, అరుణ, జయశ్రీ, కృష్ణస్వామి, విజయ్‌, రాజు పాల్గొన్నారు.

రక్తదానం చేయడం అభినందనీయం..

తన జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో టీఆర్‌ఎస్‌ మండలి కమిటీ, యువజన విభాగం మండల కమిటీల ఆధ్వర్యంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 72 మంది టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, మండల చైర్మన్‌ ప్రతికంఠం పూర్ణచందర్‌రాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌ఎన్‌ చారి తదితరులు పాల్గొన్నారు. 

ఆలేరు రూరల్‌లో..

ఆలేరు రూరల్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొలనుపాకలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. రాఘవాపురంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బక్క రాంప్రసాద్‌ మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచులు లక్ష్మీప్రసాద్‌రెడ్డి, జయమ్మ, సుజాతావీరయ్య నాయక్‌, మహేందర్‌రెడ్డి, నవ్యాశోభన్‌బాబు, పద్మాపర్వతాలు, మాధవీరవీందర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నర్సింహులు, అంజయ్య, టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షుడు భానుచందర్‌ పాల్గొన్నారు.

తుర్కపల్లిలో..

తుర్కపల్లి : ప్రభుత్వ విప్‌ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ మండల నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ బీకునాయక్‌, ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సింగిరెడ్డి నరసింహారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ నర్సింహులు, జిల్లా సభ్యురాలు ఉమారాణి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఆంజనేయులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు నవీన్‌కుమార్‌, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్‌గౌడ్‌, మాజీ డీసీసీబీ డైరెక్టర్‌ నరేందర్‌రెడ్డి, కో-ఆప్షన్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు రహమత్‌షరీఫ్‌, నాయకులు చాడ కరుణాకర్‌రెడ్డి, హరినాయక్‌, బద్దునాయక్‌, సత్యనారాయణ, రాజయ్య, యాకూబ్‌, సురేశ్‌ ఉన్నారు.

మోటకొండూర్‌లో..

మోటకొండూర్‌ : ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి జన్మదినాన్ని మండల వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో వంగపల్లి పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎగ్గిడి బాలయ్య, టీఆర్‌ఎస్‌ మండల మహిళాధ్యక్షురాలు నాగమణి, కో-ఆప్షన్‌ మెంబర్‌ బురాన్‌, డైరెక్టర్లు భూమండ్ల సుధీర్‌, బొబ్బలి యాదిరెడ్డి, పార్టీ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి పన్నాల నవీన్‌రెడ్డి, మహేంద్రన్న యువసేన మండల అధ్యక్షుడు పల్లపు మధు, ఆలేరు నియోజకవర్గ జాగృతి కన్వీనర్‌ సూదగాని ఉదయ్‌కిరణ్‌, ఎంపీటీసీ అంజిరెడ్డి, మండల ఎస్టీసెల్‌ అధ్యక్షుడు మహేశ్‌, నాయకులు శ్రీనివాస్‌, వెంకటేశ్‌, అశోక్‌, సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.

బొమ్మలరామారంలో..

బొమ్మలరామారం : ప్రభుత్వ విప్‌ జన్మదినాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గూదె బాల్‌నర్సయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రాంరెడ్డి, శ్రీనివాస్‌నాయక్‌, మహిళాధ్యక్షురాలు స్వయంప్రభ, మండల నాయకులు ఈశ్వర్‌గౌడ్‌, మల్లారెడ్డి, పాపిరెడ్డి, ఉప సర్పంచ్‌ భరత్‌ పాల్గొన్నారు.

గుండాలలో..

గుండాల : ప్రభుత్వ విప్‌ జన్మదినాన్ని మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంపీపీ తాండ్ర అమరావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కేక్‌కట్‌ చేసి పంపిణీ చేశారు.