శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 17, 2020 , 00:26:13

కార్గో సేవలను వినియోగించుకోవాలి

 కార్గో సేవలను వినియోగించుకోవాలి

రామన్నపేట : టీఎస్‌ఆర్‌టీసీ నూతనంగా ఏర్పాటు చేసిన కార్గో పార్సిల్‌ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరా రు. ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్గో పార్సిల్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో బస్టాండ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులను ప్రారంభించనున్న ట్లు తెలిపారు.బస్టాండ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.  కార్యక్రమంలో డీవీఎం కేశవులు, డీఎం రఘు, మార్కెట్‌ ఎగ్జిక్యూటివ్‌ సుమన్‌, నాయకులు నీల దయాకర్‌, బందెల రాములు, పృథ్వీరాజ్‌,బలరాం, ఎంపీటీసీ రెహాన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పోతరాజు సాయికుమార్‌,కోఆప్షన్‌ సభ్యుడు అమేర్‌, లింగం, జాడ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.      

VIDEOS

logo