యాదాద్రిలో ప్రత్యేక పూజలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో శ్రావణ ఆదివారం సందర్భంగా భక్తుల కోలాహలం నెలకొన్నది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఆలయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు సమర్పించారు. ఘనంగా సుదర్శన హోమం జరిపారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. దేవేరులను అందంగా అలంకరించి నిత్య కల్యాణం నిర్వహించి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ కల్యాణ తంతు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీ వారి కైంకర్యాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపై ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ శివాలయం ప్రధాన అర్చకులు కుంకుమార్చన నిర్వహించారు.
యాదాద్రీశుడికి రూ. 4.30 లక్షల ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ. 4,30,007 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు. ప్రసాద విక్రయాలతో రూ.3,75,870, కొబ్బరికాయలతో రూ. 39,300, వాహనపూజల ద్వారా రూ. 8,200, చెక్‌పోస్ట్ ద్వారా రూ. 910, ప్రచార శాఖ ద్వారా రూ. 2,475, అన్నదాన విరాళంగా రూ.1,252, మినీబస్సు ద్వారా రూ.2000 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్‌తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు
- అరసవల్లి సూర్యనారాయణస్వామిని తాకని భానుడి కిరణాలు