Yadadri
- Aug 17, 2020 , 00:26:36
VIDEOS
రెండ్రోజుల్లో.. ఐసొలేషన్ వార్డును.. అందుబాటులోకి తేవాలి

భువనగిరి అర్బన్ : జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానలో ఏర్పాటు చేస్తున్న ఐసొలేషన్ వార్డులో మౌలిక వసతులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఏరియా దవాఖానలో రూ.50 లక్షల సొంత నిధులతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ వార్డులో జరుగుతున్న పనులను ఆదివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా పనులు పూర్తి చేసి రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. అనంతరం దవాఖాన ఆవరణను పరిశీలించి వర్షం నీరు నిల్వకుండా చూడాలని చెప్పారు. దవాఖాన పరిసరాలలో బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించాలని చెప్పారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఒక్క కరోనా కేసు.. వారం రోజుల లాక్డౌన్
- శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో సెంచరీ
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ వేదిక మారనుందా?
- నవ్వుతూ వీడియో తీసి.. ఆత్మహత్య చేసుకుంది..
- ఫేక్ ఈ-మెయిల్స్ కేసులో హృతిక్ రోషన్ వాంగ్మూలం
- దూకుడు పెంచిన వైష్ణవ్.. వరుస సినిమాలతో సందడి..!
- టిక్‌టాక్ మాదిరిగా ఫేస్బుక్ యాప్
- కాణిపాకం వినాయకుడికి రూ.7కోట్ల విరాళం
- పార్టీలో పాటకు స్టెప్పులు.. అదరగొట్టిన ఐపీఎస్ అధికారులు
- రాహుల్ వ్యాఖ్యలపై కాషాయ నేత కౌంటర్ : కాంగ్రెస్ అందుకే కనుమరుగైంది!
MOST READ
TRENDING