మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Aug 17, 2020 , 00:26:41

అధికారులూ.. బీ అలర్ట్‌

అధికారులూ.. బీ అలర్ట్‌

  • కలెక్టర్‌  అనితారామచంద్రన్‌ 

భువనగిరి కలెక్టరేట్‌ : జిల్లాలో కురుస్తున్న వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తెలిపారు. ఆదివారం రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన గూగుల్‌మీట్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. చెరువు, కుంట కట్టలు వర్షాలకు దెబ్బతినకుండా చూడాలన్నారు. వర్షంతో జరిగిన పంట నష్టాన్ని మండలాల వారీగా నివేదిక అందజేయాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో భువనగిరి మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

లోతట్టు ప్రాంతాల పరిశీలన 

భువనగిరి అర్బన్‌  :  పట్టణంలోని కుమ్మరివాడ లోతట్టు ప్రాంతాన్ని ఆదివారం కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ పరిశీలించారు. అదేవిధంగా పట్టణ పరిధిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ వెంచర్‌లో 14ఎకరాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా చేపట్టే మియావాకి చెట్లు నాటే స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, కమిషనర్‌ వంశీకృష్ణ తదితరులు ఉన్నారు. 

VIDEOS

logo