మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Aug 17, 2020 , 00:27:39

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

  • వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు

వికారాబాద్‌: వర్షాలు మరో రెండు రోజులు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు సూచించా రు. ఈ మేరకు  ఆదివారం ఆమె ఒక  ప్రకటన విడుదల చేశారు. ముందస్తు అనుమతి లేకుండా జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు తమ స్థానాన్ని వదిలి వెళ్లవద్దని కలెక్టర్‌ ఆదేశించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం కార్యక్రమాలు నిరంతరం జరిగేలా చూడాలన్నారు. అంటూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయం కావాల్సిన ప్రజలు 6305954956 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు తెలిపారు.

VIDEOS

logo