శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Aug 16, 2020 , 00:56:53

కన్నుల పండువగా లక్షపుష్పార్చన

కన్నుల పండువగా లక్షపుష్పార్చన

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శనివారం ఉదయం లక్షపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఏకాదశి, శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని వివిధ పుష్పాలతో ఘనంగా అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధానాచార్యులు నరసింహాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నరసింహామూర్తి తదితరులు పాల్గొన్ని పూజలు చేశారు.

శాస్ర్తోక్తంగా నిత్యపూజలు..

బాలాలయంలో స్వామివారికి శాస్ర్తోక్తంగా సంప్రదాయ పూజలు నిర్వహించారు. వేకువజామునే సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం అభిషేకం, పుష్పార్చన చేపట్టారు. మంటపంలో ఉత్స వ మూర్తులకు అష్టోత్తర పూజలు, శ్రీ సుదర్శన నారసింహ మం జరిపారు. ఆగమశాస్ర్తోకంగా స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. 

VIDEOS

logo