బుధవారం 03 మార్చి 2021
Yadadri - Aug 16, 2020 , 03:51:38

అటవీ శాఖ అధికారులకు క్యాష్‌ రివార్డు

అటవీ శాఖ అధికారులకు క్యాష్‌ రివార్డు

భువనగిరి క్రైం : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భువనగిరి అటవీ శాఖ అధికారులకు ఉన్నతాధికారులు క్యాష్‌ రివార్డ్డును ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆర్‌.శోభ నుంచి వీరు క్యాష్‌ రివార్డులు అందుకున్నారు. రివార్డులు స్వీకరించిన వారిలో భువనగిరి డిప్యూటీ రేంజ్‌ అధికారి నిఖిలేశ్‌, దత్తాయపల్లి రేంజ్‌ అధికారి షాహిన్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి రాములు, చౌటుప్పల్‌ డిప్యూటీ రేంజ్‌ అధికారి వెంకటరాములు, ఫారెస్ట్‌ బీట్‌ అధికారి రమేశ్‌, డాటా ప్రాసెసింగ్‌ అధికారి రవీందర్‌ ఉన్నారు. 

VIDEOS

logo