సోమవారం 28 సెప్టెంబర్ 2020
Yadadri - Aug 15, 2020 , 00:39:31

ఎమ్మెల్యే సొంత నిధులతో ఐసొలేషన్‌ వార్డు

 ఎమ్మెల్యే సొంత నిధులతో ఐసొలేషన్‌ వార్డు

  • n భువనగిరి ఏరియా దవాఖానలో 20 పడకలతో ఏర్పాటు 
  • n ప్రారంభించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి  
  • n కొవిడ్‌ బాధితులు పూర్తి వైద్య సదుపాయం 
  • n ప్రభుత్వాస్పత్రుల్లోనే చక

భువనగిరి కలెక్టరేట్‌ : కొవిడ్‌ బాధితులకు పూర్తి వైద్య సదుపాయాలు అందించాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా ఏరియా దవాఖానలో ఎమ్మెల్యే సొంత నిధులు రూ.50 లక్షలతో 20 పడకల ఐసోలేషన్‌ వార్డును కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొవిడ్‌ పేషెంట్ల కు ఆత్మైస్థెర్యాన్ని పెంపొందించాలన్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ మాట్లాడుతూ కొవిడ్‌ పేషెంట్లకు ఐసోలేషన్‌ వార్డులో ఆక్సిజన్‌ సైప్లె ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్యాధికారులు, సిబ్బంది నిరంతరాయంగా కొవిడ్‌ పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. భువనగిరి ఐసోలేషన్‌ వార్డులో బెడ్లు 20, 10 ఆక్సిజన్‌ సిలిండర్లు, చిన్నసిలిండర్లు 3, పరీక్షల కోసం 6 ల్యాబ్‌లు, 15 మంది వార్డుబాయ్స్‌, 15 మంది సిస్టర్లు, 15 మంది శానిటైజేషన్‌ సిబ్బం ది, ఆరుగురు దోబీ వర్కర్లు, ఆరుగురు కంప్యూటర్‌ ఆపరేటర్లను ఏర్పాటు చేశామని, వారికి ప్రతి నెల వేతనాన్ని ఎమ్మెల్యే చెల్లించనున్నట్లు తెలిపారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను తమకు ప్రతి రోజూ తెలియజేయాలని వైద్యాధికారికి సూచించారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి బ్లాక్‌ వైస్‌ ఐసోలేషన్‌ వార్డును ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కిష్టయ్య,  జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, జిల్లా ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌ రవికుమార్‌,  టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్‌, భగత్‌, వేణుగోపాల్‌రెడ్డి, అందె శంకర్‌, కోఆప్షన్‌ సభ్యులు రాచమల్ల రమేష్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ అబ్బగాని వెంకట్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎడ్ల రాజేందర్‌రెడ్డి, తుమ్మేటి పాండు తదితరులు పాల్గొన్నారు.  టి వైద్యం : కలెక్టర్‌ 


logo