గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 14, 2020 , 03:19:11

జనరంజకం.. సందేశాత్మకం..

జనరంజకం.. సందేశాత్మకం..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చిల్డ్రన్స్‌ ఆన్‌లైన్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ ముగిసింది. 13 రోజుల పాటు  ఈ నాటకోత్సవం ఎంతగానో అలరించింది. వివిధ జిల్లాల పాఠశాలల విద్యార్థులు రోజుకూ రెండు ప్రదర్శనల చొప్పున.. 26 నాటకాలను అద్భుతంగా, సందేశాత్మకంగా.. జనరంజకంగా ప్రదర్శించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, అభినయ థియేటర్‌ ట్రస్ట్‌ సంయుక్తాధ్వర్యంలో జరిగిన  ఈ ఉత్సవంలో బాలలు తమ సృజనాత్మకశక్తిని, ప్రతిభను చాటుకున్నారు.

ఆకట్టుకున్నాయి.. గురువారం ప్రదర్శించిన ‘ద పేరెట్స్‌ టేల్‌ - పావు టికెట్‌ పరేషాన్‌' నాటిక వీక్షకులను రంజింపజేసింది. నగరంలోని రామచంద్రాపురం - తెల్లాపూర్‌, మంథన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఎంతో చక్కగా  ప్రదర్శించారు. ఈ నాటికను విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించారు. ‘పావు టికెట్‌ పరేషాన్‌' అనే సాంఘిక పౌరాణిక నాటికను సాంఘిక సంక్షేమ గురుకుల లలిత కళల పాఠశాల విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. యమ ధర్మరాజు, చిత్రగుప్తుడు, 11 ఏండ్ల బాలుడికి మధ్య జరిగే కథను దర్శకులు ఎన్‌.దీనబాంధవ ఆద్యంతం రక్తి కట్టించారు. 

VIDEOS

logo