శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 14, 2020 , 03:19:56

యాదాద్రిలో ఘనంగా నిత్య పూజలు

 యాదాద్రిలో ఘనంగా నిత్య పూజలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం నిత్యపూజలు ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయాన్నే సుప్రభాత సేవ చేసిన అనంతరం బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. వివిధ పుష్పాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి తులసీదళాలు, పుష్పాలతో అర్చన చేశారు. మంటపంలో శ్రీ సుదర్శన నారసింహహోమం, నిత్య కల్యాణ వేడుకలు వైభవంగా జరిపారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు నివేదన జరిపించి, శయనోత్సవం చేపట్టారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నా రు. భక్తులు భౌతికదూరం ఉండేలా సిబ్బంది చర్యలు తీసుకున్నారు.

 యాదాద్రీశుడికి రూ.1.88 లక్షల ఆదాయం 

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ. 1,88,705 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాద విక్రయాలతో రూ.1,61,365,  కొబ్బరికాయలతో రూ. 21,450, వాహనపూజల ద్వారా రూ. 1,800, చెక్‌పోస్ట్‌ నుంచి రూ. 1,220, ప్రచార శాఖ ద్వారా రూ. 1,650, మినీబస్సు ద్వారా రూ. 1,220 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. 


VIDEOS

logo