రోజంతా ముసురే

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ముసురువాన పడుతోంది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ముసురువానకు ఇండ్ల నుంచి బయటకెళ్లే పరిస్థితి లేకపోవడంతో రోజువారి కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. చెరువులు, కుంటల్లోకి వరద పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని చెరువులు నిండి అలుగుపోసేందుకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని నిండుతున్నాయి. చాలావరకు వరినాట్లు పూర్తికాగా, ముసురువానతో మెట్ట పంటలకు ఊపిరి పోసినట్లయ్యింది. పత్తి, కందులు, పెసర తదితర పంటలకు ఢోకా ఉండదని అన్నదాతలు ఆనందపడుతున్నారు. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షంతో మూసీ పోటెత్తుతోంది. భూదాన్‌పోచంపల్లి, వలిగొండ మండలాల్లో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. మరో రెండురోజులు వానలు ఉంటాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. - నమస్తే తెలంగాణ బృందం
మోత్కూరు /భువనగిరి కలెక్టరేట్ : తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న ముసురుతో జిల్లా రైతాంగం ఆనందోత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మెట్ట పంటలైన పత్తి, కంది, పెసర, నువ్వులకు కురుస్తున్న వర్షాలు జీవం పోసినైట్టెందని రైతులు సంతోష పడుతున్నారు. వరి సాగుకు రైతులు దుక్కుల దున్నకం పనులు ముమ్మరంగా చేస్తున్నారు. బోరు, బావుల కింద సాగు చేస్తున్న రైతులు నాట్లు వేస్తున్నారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం రాత్రి వరకు పడిన చిరుజల్లుల వర్షాన్ని మండలాల వారీగా చూస్తే, రాజాపేట 17.8 మి.మీ, ఆలేరు 15.8 మి.మీ, ఆత్మకూర్ 15.4 మి.మీ, మోత్కూర్ 14.8 మి.మీ, గుండాల 13.2 మి.మీ, యాదగిరిగుట్ట 10.6 మి.మీ, భువనగిరి 6.0 మి.మీ, రామన్నపేట 8.0 మి.మీ, తుర్కపల్లి 6.8 మి.మీ, బీబీనగర్ 6.0 మి.మీ, పోచంపల్లి 5.6 మి.మీ, చౌటుప్పల్ 4.6 మి.మీ, సంస్థాన్‌నారాయణపూర్ 4.2 మి.మీ, వలిగొండ 4.2 మి.మీ, బొమ్మలరామారం 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
తాజావార్తలు
- రాజశేఖర్ కూతురు తమిళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- డేటా చోరీ గిఫ్ట్‌ల పేర బురిడీ..!
- షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
- ఓటీపీ చెప్పండి.. కార్డు గడువు పొడిగిస్తాం..!
- రెండు రోజుల్లో.. రూ. 5లక్షలకు 4.5 కోట్లు లాభం
- రుణాల పేరుతో.. బురిడీ..
- పెండ్లి పేరుతో వల.. రూ. 10.69లక్షలు టోకరా
- బండి ఆపు.. పైసలివ్వు..!
- బండిస్తే జైలుకే..