శనివారం 31 అక్టోబర్ 2020
Yadadri - Aug 13, 2020 , 00:03:40

బాధితులకు చక్కటి వైద్యమందించాలి

బాధితులకు చక్కటి వైద్యమందించాలి

  • ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యాన్ని ఆరాతీయాలి 
  • హోంఐసొలేషన్‌లో ఉన్నవారికి సలహాలివ్వాలి 
  • బాధితులను అంటరాని వారిగా చూడొద్దు 
  • వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ ఆదేశం 

 భువనగిరి కలెక్టరేట్‌ : కరోనా బాధితులకు పూర్తిస్థాయిలో వైద్య సదుపాయాలు కల్పించాలని  వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ సూచించారు. బుధవారం స్థానిక వివేరా హోటల్‌లో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అధ్యక్షతన డాక్టర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, మెడికల్‌ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా  ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఏరియా దవాఖానతో పాటు ఎయిమ్స్‌, ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్‌ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో కరోనా పేషెంట్లకు పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించాలన్నారు. కొవిడ్‌ పేషెంట్లతో ప్రాథమిక సంబంధాలు ఉన్న వ్యక్తులను ఐదు నుంచి ఆరు రోజుల తర్వాత గుర్తించి టెస్టింగ్‌, వైద్య సదుపాయం కల్పించాలన్నారు. కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ మాట్లాడుతూ మెడికల్‌ ఆఫీసర్లు తప్పకుండా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు వివరణ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ గరీమాఅగర్వాల్‌, జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.