మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Yadadri - Aug 11, 2020 , 00:03:32

ఘనంగా ఎమ్మెల్యే పైళ్ల జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే పైళ్ల జన్మదిన వేడుకలు

  • నియోజకవర్గవ్యాప్తంగా కోలాహలం  
  • జోరుగా కేకుల కోతలు, అన్నదానాలు 
  • వికలాంగులకు నిత్యావసరాల పంపిణీ 
  • మిఠాయిలు పంపిణీ చేసిన పార్టీ నాయకులు  

భువనగిరి : భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి జన్మదినాన్ని టీఆర్‌ఎస్‌ మండల పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన కేక్‌కట్‌ చేశారు. నిరుపేదలు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. తన సొంత నిధులతో నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చి సుజలదాతగా పేరు సంపాదించుకున్నారని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

నాగిరెడ్డిపల్లి సర్పంచ్‌ జక్క కవితారాఘవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జనగాం పాండు, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ అబ్బగాని వెంకట్‌గౌడ్‌, మండల ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ కంచి మల్లయ్య, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ బల్గూరి మధుసూదన్‌రెడ్డి, చందుపట్ల రాజేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో, మండలంలోని నమాత్‌పల్లి, తాజ్‌పూర్‌ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి జన్మదినాన్ని నిర్వహించారు.

భువనగిరి అర్బన్‌లో..

భువనగిరి అర్బన్‌: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి జన్మదినాన్ని పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు కేక్‌కట్‌ చేసి పంపిణీ చేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, కౌన్సిలర్లు చెన్న స్వాతిమహేశ్‌, నజీయరహమాన్‌ జహంగీర్‌, క్రాంతిఅంచక, కడారి ఉమాదేవి, తుమ్మల అనురాధాపాండు, దిడ్డికాడి భగత్‌, కిరణ్‌కుమార్‌, జిట్ట వేణుగోపాల్‌రెడ్డి, పంగరెక్క స్వామి, కో-ఆప్షన్‌ సభ్యులు రాచమల్ల రమేశ్‌, ఇట్టబోయిన సబితాగోపాల్‌, సయ్యద్‌ అప్జల్‌, నిఖిత్‌ఇక్బాల్‌ చౌదరి, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజేందర్‌రెడ్డి, బాషబోయిన రాజేశ్‌, శెట్టి బాలయ్యయాదవ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని 17వ వార్డు వికలాంగులకు కౌన్సిలర్‌ సహకారంతో నిత్యావసర సరుకులను మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు అందజేశారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, వార్డు అధ్యక్షుడు గాదె శ్రీనివాస్‌, నాయకులు రవి, సోమరామకృష్ణ, సోమ్‌చంద్‌, అనిల్‌, హరిబాబు, సత్యనారాయణ పాల్గొన్నారు.

బీబీనగర్‌లో... 

బీబీనగర్‌: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి జన్మదినాన్ని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బొక్కా జైపాల్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, పట్టణ సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద కేక్‌కట్‌ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారిపై మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకుడు ఆకుల ప్రభాకర్‌, మండల కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నారగోని మహేశ్‌గౌడ్‌, ఎస్‌ఎంసీ డైరెక్టర్‌ మాదారం రాంకుమార్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మంచాల రవికుమార్‌, మాజీ వైస్‌ ఎంపీపీ కొంతం లింగయ్యగౌడ్‌, నాయకులు తొర్పునూరి శేఖర్‌గౌడ్‌, వనం శ్రీశైలం, వీరూనాయక్‌, చీర అవిలయ్య, సోమరమేశ్‌లతోపాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో..

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా మండల కేంద్రానికి చెందిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని రాయగిరిలో గల సహృదయ అనాథ ఆశ్రమం, వంగపల్లిలోని అమ్మఒడి మానసిక వికలాంగుల నిలయంలోని వృద్ధులకు అన్నదానం చేశారు. సంఘం రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ, ఉపసర్పంచ్‌ దస్తగిరి నాయకులు అమృతం శివకుమార్‌, ఎలుగుల నరేందర్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత గోళి పింగళ్‌రెడ్డి ఆధ్వర్యంలో.. 

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని టీచర్స్‌ కాలనీలోని ప్రకృతి వనంలో టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భాగ్యలక్ష్మి, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ అక్బర్‌, వార్డు సభ్యులు నెల్లుట్ల ప్రశాంతీశ్రీశైలం, మంగ లతాలింగేశ్‌, పొట్ట అంజి, నాయకులు గుంటిపల్లి లక్షీనారాయణ, రాగీరు శ్యాంగౌడ్‌, చంద్రశేఖర్‌, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

వలిగొండలో...

వలిగొండ: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి జన్మదినాన్ని మండల టీఆర్‌ఎస్‌ కార్యాలయం ఆవరణలో టీఆర్‌ఎస్‌ నాయకులు కేక్‌కట్‌ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డేగల పాండరి, వలిగొండ పీఏసీఎస్‌ అధ్యక్షుడు సుర్కంటి వెంకట్‌రెడ్డి, పైళ్ల భీమార్జున్‌రెడ్డి, గంగాధారి రాములు, ఎంపీటీసీలు పల్సం రమేశ్‌, తుమ్మల వెంకట్‌రెడ్డి, మోటె నర్సింహ, గొల్నెపల్లి సర్పంచ్‌ గూడూరు శివశాంత్‌రెడ్డి, మదర్‌డెయిరీ డైరెక్టర్‌ గూడూరు శ్రీధర్‌రెడ్డి, చెర్కు శివయ్య, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు ముదిరెడ్డి సంజీవరెడ్డి, పోలేపాక సత్యనారాయణ, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గంగధారి శ్రీనివాస్‌, వలిగొండ పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అయిటిపాముల రవీంద్ర, పార్టీ కార్యదర్శి మామిండ్ల రత్నయ్య, అయిటిపాముల సత్యనారాయణ, ప్రభాకర్‌, యూత్‌ అధ్యక్షుడు లింగస్వామి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎడవెల్లి శాంతికుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పల్లేర్ల ప్రకాశ్‌, సురేశ్‌, వెంకటేశం, రమేశ్‌, సాయి పాల్గొన్నారు. 

భూదాన్‌పోచంపల్లిలో.. 

భూదాన్‌పోచంపల్లి : భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి జన్మదినాన్ని టీఆర్‌ఎస్‌ మండల పార్టీ, యువజన విభాగాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వద్ద, చేనేత సహకార సంఘం భవనం వద్ద ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మి కేక్‌కట్‌ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశం, యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ కందాడి భూపాల్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సామ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు బత్తుల మాధవీశ్రీశైలంగౌడ్‌, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ రావుల శేఖర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గోరంటి శ్రీనివాస్‌రెడ్డి, గుండు మధు, శ్రీకాంత్‌, నాయకులు పాల్గొన్నారు. 


logo