గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 10, 2020 , 00:02:10

పెండ్లి ఇంట్లో విషాదం

పెండ్లి ఇంట్లో విషాదం

  • గుండెపోటుతో పెండ్లి కూతురు మేనత్త మృతి

ఆత్మకూరు(ఎం): పెండ్లి తంతు ముగియకముందే పెండ్లి కూతురు మేనత్త నాగం లలిత(46) గుండెపోటుతో శనివారం మృతి చెందింది. మండల కేంద్రానికి చెందిన లలిత కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నది. తన సోదరుడి కుమార్తె వివాహం శనివారం మండల కేంద్రంలోని వైబీఆర్‌ గార్డెన్‌లో జరిగింది. వివాహ వేడుకలో బంధుమిత్రులతో సంతోషంగా గడిపిన లలిత మేనకోడలు అప్పగింతలు పూర్తి కాకముందే గుండెనొప్పితో పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు స్థానిక ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. లలిత ఆకస్మిక మృతితో బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

VIDEOS

logo