బుధవారం 30 సెప్టెంబర్ 2020
Yadadri - Aug 10, 2020 , 00:02:33

మొక్కలే జీవకోటికి ప్రాణధారం

మొక్కలే జీవకోటికి ప్రాణధారం

ఆలేరురూరల్‌ : మొక్కలే జీవకోటికి ప్రాణధారమని సర్పంచ్‌ పులుగం పద్మాయాదిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పటేల్‌గూడెంలో ఆరో విడుత హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరు వైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెట్లతోనే మానవాళి భవిష్యత్‌ ఆధారపడి ఉందని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ బండ్రు లక్ష్మి, వార్డు సభ్యులు బొమ్మకంటి సిద్ధిరాజు, కాల్వ గౌతమి పాల్గొన్నారు.logo