సోమవారం 01 మార్చి 2021
Yadadri - Aug 10, 2020 , 00:02:35

చిరు వ్యాపారులకు రుణాలు

చిరు వ్యాపారులకు రుణాలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ:యాదగిరిగుట్టలోని చిరు వ్యాపారులు  ప్రధాన మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మ నిర్భర్‌ నిధి పథకం ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ జంపాల రజిత ఆదివార ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని అర్హత గల వ్యాపారులకు రూ.10 వేల రుణాన్ని బ్యాంకుల ద్వారా మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. వ్యాపారులు ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, పాస్‌ఫొటో, వ్యాపార యూనిట్‌ ఫొటోతో మున్సిపాలిటీలోని మెప్మా విభాగంలో పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. వివరాలకు 9701330202, 7989489014నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.

VIDEOS

logo