బకాయి కట్టేంద్దాం..

- n ఆస్తిపన్ను బకాయి పై 90 శాతం వడ్డీ మాఫీ
- n అసలు, పదిశాతం వడ్డీ చెల్లింపునకు సర్కారు అవకాశం
- n వన్ టైం స్కీమ్ ప్రారంభం
- n వచ్చేనెల 15 వరకు చెల్లించే వెసులుబాటు
- n జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు.. 41,034 అసెస్మెంట్స్
- n పేరుకుపోయిన బకాయిలు రూ.8.23 కోట్లకు పైనే
- n పన్ను చెల్లింపుపై మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం
- n సకాలంలో చెల్లించడమే మేలంటున్న పురపాలక అధికారులు
+ మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. ఇది సకాలంలో వసూలవుతేనే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయి. ప్రతియేటా ఆస్తిపన్ను చెల్లించడం పౌరుల బాధ్యత. ఈ బాధ్యత సరిగ్గా లేకుంటే అక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది.
+ 2004 నుంచి 2014 వరకు ఆస్తిపన్ను బకాయిలపై విధించే 2 శాతం వడ్డీ, చక్రవడ్డీ భారాన్ని ప్రతియేటా మార్చిలో రద్దు చేశారు. దీనివల్ల సకాలంలో చెల్లించేవారు కూడా వడ్డీతో కట్టేందుకు వెనుకంజ వేస్తుండడంతో ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసింది. వార్షిక పన్ను జూన్‌లో చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ప్రకటించినా ఆశించిన స్పందన రావడం లేదు.
+ తాజాగా పురపాలక సంఘాల్లో ఆస్తిపన్ను (ప్రాపర్టీ ట్యాక్స్) చెల్లింపుదారులకు సర్కారు తీపికబురు అందించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను పై విధించిన వడ్డీని 90 శాతం మాఫీ చేసింది. బకాయి, పదిశాతం వడ్డీ చెల్లించేలా వన్ టైం స్కీమ్ (ఓటీఎస్)ను పురపాలకశాఖ తీసుకొచ్చింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు చెల్లించే వెసులుబాటు కల్పించింది. తమతమ బకాయి మొత్తాన్ని సంబంధిత మున్సిపాలిటీ కార్యాలయంలో లేదా ఆన్లైన్లో కూడా చెల్లించొచ్చు. దీనివల్ల ఆస్తిపన్ను చెల్లింపుదారులకు రూ.కోట్లలో ప్రయోజనం కలుగనుంది. జిల్లావ్యాప్తంగా ఆరు పురపాలక సంఘాలున్నాయి. వీటిల్లో 41,034 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ఉండగా, రూ.8.23 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. పన్ను చెల్లింపుపై అన్ని మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి మాఫీ పథకం భవిష్యత్‌లో ఉండకపోవచ్చని, సకాలంలో చెల్లించడమే మేలని అధికారులు సూచిస్తున్నారు.
-యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,నమస్తేతెలంగాణ
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆస్తి పన్ను చెల్లించేవారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల కోసం ఓటీఎస్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సంబంధిత శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. వన్‌టైం స్కీం కింద ప్రాపర్టీ ట్యాక్స్‌పై కేవలం 10 శాతం వడ్డీ కడితే సరిపోతుంది. 2019-20 ఆస్తి పన్ను మొత్తాన్ని పది శాతం వడ్డీతో చెల్లిస్తే మిగతా 90 శాతం వడ్డీని మాఫీ చేయనున్నారు. అయితే ఈ అవకాశాన్ని కేవలం 45 రోజుల పాటు మాత్రమే కల్పించింది. ఆగస్టు 1 నుంచి ప్రారంభమైన ఈ విధానం సెప్టెంబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 41,034 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంబంధించి రూ.8.23 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీనిపై ఉన్న వడ్డీలో 90 శాతం వరకు ప్రభుత్వం మాఫీ చేయనుండటంతో ఆయా మున్సిపాలిటీ పరిధిలోని పన్నుదారులకు ఇది గొప్ప ఊరట గొలిపే విషయం.
అనేక వర్గాలకు ఊరట..
మున్సిపాలిటీల్లో బకాయిలపై పేరుకున్న వడ్డీతో అసలు చెల్లించడానికి అనేక మంది వెనుకంజ వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గతంలో 2004 నుంచి 2014 వరకు ఆస్తిపన్ను బకాయిలపై విధించే 2 శాతం వడ్డీ, చక్రవడ్డీ భారాన్ని ఏడాదికో పర్యాయం రద్దు చేస్తూ వచ్చింది. క్రమం తప్పకుండా పన్ను చెల్లించే వారు సైతం దీనిని ఆసరాగా చేసుకొని పన్ను చెల్లించడం లేదని గుర్తించిన ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసింది. తాజా వార్షిక పన్నును జూన్‌లోనే చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీని ప్రకటించినా ఆశించిన మేర స్పందన రాలేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆస్తి పన్ను బకాయిలపై విధించే వడ్డీలో 90 శాతం మేర రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అపరాధ రుసుములో 10 శాతం, పన్ను అసలు బకాయిలు ఏక మొత్తంలో చెల్లించే వారికి ఈ అవకాశాన్ని కల్పించింది. కరోనా నేపథ్యంలో ఆదాయ మార్గాలు కుచించుకుపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అనేక వర్గాలకు ఇది ఊరటనిస్తోంది. పన్ను బకాయిల వసూళ్లకు గట్టి చర్యలు తీసుకోలేక.. రావాల్సిన ఆదాయం రాకపోవడంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న మున్సిపాలిటీల ఆదాయం సైతం వన్‌టైం స్కీంతో గాడిన పడనున్నది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 13,617 ఆస్తులు ఉండగా వీటిపై రూ.4.80 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. దీనికితోడు 2020-21 సంవత్సరానికి సంబంధించి రూ.4.48 కోట్ల వరకు పన్ను వసూలు చేయాలన్నది లక్ష్యం. జూన్ 30 వరకు రూ.94లక్షల వరకు పన్నులను వసూలు చేశారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన పన్నులతో పాటు పాత బకాయిలను వసూలు చేయడం మున్సిపాలిటీ సిబ్బందికి కష్టతరంగా మారింది.
వన్‌టైం స్కీంలో భాగంగా రూ.1.50 కోట్ల వరకు వడ్డీ మాఫీ కానున్నది. దీంతో పన్నులు పెద్ద మొత్తంలో వసూలు అవుతాయని అధికారులు భావిస్తున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 7,604 ఆస్తులు ఉండగా వీటికి సంబంధించి రూ.1.08 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. 90 శాతం వడ్డీ మాఫీలో భాగంగా ఇక్కడి పన్నుదారులకు రూ.5.35 లక్షల వరకు వడ్డీ రద్దు అవుతున్నది. భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలో ఉన్న 4,774 ఆస్తులకు సంబంధించి రూ.1.04కోట్ల మేర ఉన్న బకాయిలపై అపరాధ రుసుము రూ.5.29లక్షల వరకు మాఫీ కానున్నది. మోత్కూరు మున్సిపాలిటీలో ఉన్న 5,080 ఆస్తులకు సంబంధించి రూ.62.73 లక్షల వరకు బకాయిలు ఉండగా 90 శాతం మేర రూ.1.13లక్షల వరకు మాఫీ కానుండటంతో కేవలం రూ.12వేల వరకే పన్నుదారులు వడ్డీని చెల్లిస్తే సరిపోతుంది. ఆలేరు మున్సిపాలిటీలో 5,530 వరకు ఆస్తులు ఉండగా రూ.1.44 కోట్ల వరకు పాత బకాయిలు ఉన్నాయి. అలాగే యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఉన్న 4,429 ఆస్తులకు సంబంధించి రూ.23 లక్షల వరకు బకాయిలు ఉండగా ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ వన్‌టైం స్కీంలో పెద్దమొత్తంలో వడ్డీ మాఫీ కానున్నది.
విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం..
తాజావార్తలు
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
- సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతి
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్