ఆలయ పనుల పరిశీలన

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పనులను స్థపతి ఆనందసాయి వేలు శనివారం పరిశీలించారు. తుది దశ పనులను పర్యవేక్షించి శిల్పులకు సూచనలు చేశారు. ఆలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కాగా, గోపురాలు, శిల్పాలు, మంటపాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు.ఆయన శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రధాన ఆలయంలోపల కలియ తిరిగారు. అనంతరం ఆలయం వెలుపలకి వచ్చి శిల్పులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తుది దశ పనులు జాగ్రత్తగా పూర్తి చేసి, శిల్పాలు, గోపురాలను అందంగా ముస్తాబు చేయాలని సూచించారు.
వైంకుఠద్వారం పనుల పరిశీలన
వైకుంఠద్వారం వద్ద ఆర్చ్‌కు ఇరువైపులా మెట్ల నిర్మాణం కోసం చేపడుతున్న పనులను ఆర్అండ్బీ ఈఈ శంకరయ్య శనివారం పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన వైంకుఠ ద్వారానికి సమీపం నుంచే గిరి ప్రదక్షిణ రోడ్డు వెళ్తున్నది. దీంతో ఆర్చ్‌కు ముందు నుంచి కాకుండా ఇరు పక్కల నుంచి మెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం వైకుంఠ ద్వారానికి ఇరు వైపులా గుంతలు తీస్తున్నారు. అడ్డుగా ఉన్న రాళ్లను తొలగిస్తున్నారు. ఈ పనులను ఆర్అండ్బీ ఈఈ శంకరయ్య పర్యవేక్షించారు.
తాజావార్తలు
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
- ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30
- సుశాంత్ కేసు.. వెయ్యి పేజీలపైనే ఎన్సీబీ చార్జ్‌షీట్
- రక్షణ బడ్జెట్‌ను పెంచిన చైనా
- గాలి సంపత్ నుండి 'పాప ఓ పాప..' వీడియో సాంగ్ విడుదల
- పాతబస్తీలో ఆకతాయిల బీభత్సం