ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Aug 09, 2020 , 00:04:48

యాదాద్రిలో శాస్త్రోక్తంగా పూజలు

 యాదాద్రిలో శాస్త్రోక్తంగా పూజలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి శాస్ర్తోక్తంగా సంప్రదాయ పూజలు నిర్వహించారు. వేకువజామునే సుప్రభాత సేవతో ప్రారంభించి స్వామివారికి అర్చనలు, అభిషేకం, సువర్ణపుష్పార్చన నిర్వహించారు. మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు, శ్రీ సుదర్శన నారసింహహోమం జరిపారు. ఆగమశాస్త్ర ప్రకారంగా స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మంటపంలోనే ఊరేగించారు. సుమారు గంటన్నర పాటు కల్యాణ తంతు కొనసాగింది. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయుడికి పూజలు జరిగాయి. రాత్రి వేళ స్వామి అమ్మవార్లకు మహా నివేదన అనంతరం శయనోత్సవం జరిపించారు. 

VIDEOS

logo