శనివారం 31 అక్టోబర్ 2020
Yadadri - Aug 07, 2020 , 23:50:52

ఆసరా పింఛన్లు మంజూరు చేయాలి

ఆసరా పింఛన్లు మంజూరు చేయాలి

భువనగిరి కలెక్టరేట్‌ : అర్హులైన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చే యాలని కోరుతూ పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్‌ పడిగెల రేణుకాప్రదీప్‌ శుక్రవారం కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ రేణుక మాట్లాడుతూ.. వార్డులో అర్హులైన వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు ఆసరా పిం ఛన్‌ కోసం ఆరు నెలల కిందట మున్సిపల్‌ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారని, కానీ ఇప్పటి వరకు మంజూరు కాలేదన్నారు. వెంటనే వారికి ఆసరా పింఛన్లు మంజూరు అయ్యేలా చూడాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో కాలనీవాసులు భద్రమ్మ, పెంటమ్మ, ఎల్ల మ్మ, పార్వతమ్మ, చంద్రకళ, సుగుణమ్మ, లక్ష్మి, కిష్టయ్య పాల్గొన్నారు.