బుధవారం 21 అక్టోబర్ 2020
Yadadri - Aug 07, 2020 , 23:50:54

జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు   దరఖాస్తుల ఆహ్వానం

భువనగిరి అర్బన్‌ : యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా జూనియర్‌ కళాశాలలు అప్‌గ్రేడ్‌ అవుతున్న క్రమంలో తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఎంపీసీ, బీపీసీ కోర్సులను బోధించుటకు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన జూనియర్‌ లెక్చరర్లు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లెక్చరర్లు ఇంగ్లీష్‌, ఉర్దూ, తెలుగు, గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జూవాలజీ సబ్జెక్టులను బోధించాలని, వయసు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య కలిగియుండాలని, పోస్టు గ్రాడ్యుయేషన్‌ నందు 50శాతం మార్కులు, సంబంధిత సబ్జెక్టు నందు బీఈడీ పూర్తి చేసి జూనియర్‌ కళాశాలలో మూడు సంవత్సరాల అనుభవం గల వారు అర్హులని చెప్పారు. సంబంధిత ధ్రువపత్రాలతో ఈ నెల 11 సాయంత్రం 5 గంటల లోపు పట్టణంలోని పాత మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలోని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 95056 40004 నెంబరులో సంప్రదించాలని తెలిపారు.


logo