గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 07, 2020 , 23:50:58

ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి దాదాగిరి

ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి దాదాగిరి

  • l    మున్సిపల్‌ చైర్మన్‌పై ఎమ్మెల్యే దాడి  
  • l   చెయ్యి చూపిస్తూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే 
  • l   చౌటుప్పల్‌ మున్సిపల్‌ కోఆప్షన్‌ ఎన్నిక రసాభాస 
  • l   చైర్మన్‌ లేకుండానే ఎన్నిక నిర్వహించాలని పట్టు  
  • l   మున్సిపల్‌ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత 
  • l   చివరకు కోరం లేక ఎన్నిక వాయిదా 

చౌటుప్పల్‌ పురపాలిక కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరగకుండానే రసాభాసగా ముగి సింది. చైర్మన్‌ రాకముందే ఎన్నిక నిర్వహించాలని పట్టుబట్టిన ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సభలో నానా గందరగోళం సృష్టించారు. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ను తన వైపునకు తిప్పుకునేందుకు యత్నించి విఫలమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, రెచ్చిపోయిన ఎమ్మెల్యే చైర్మన్‌పై దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసి స్తూ కోఆప్షన్‌ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు. ఎమ్మెల్యే దాదాగిరిపై టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, నాయకులు ఆందోళన చేపట్టారు.             

        - చౌటుప్పల్‌ 

 

చౌటుప్పల్‌: మండల కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం లో శుక్రవారం కో ఆప్షన్‌ సభ్యుల  ఎన్నిక  రసాభాసగా మారింది. ఉదయం 11.30 గంటలకు మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం సమావేశం నిర్వహించారు. ఎక్స్‌ ఆఫీషియే ఓటు కలిగిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి  ఐదుగురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లతో కలిసి సమావేశానికి వచ్చారు. అప్పటికీ సమయం ఉండటంతో మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు సమావేశానికి హాజరు కాలేదు. అయినప్పటికీ కమిషనర్‌ రాందుర్గారెడ్డిని సమావేశం మొదలు పెట్టి ఎన్నిక నిర్వహించాల్సిందిగా ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారు. మున్సిపల్‌ చైర్మన్‌ లేనిదే ఎన్నిక జరుపటానికి వీలుకాదని కమిషనర్‌ చెప్పినా ఆయన ససేమిరా అన్నారు. వెంటనే ఎన్నిక ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు.  దీంతో మున్సిపల్‌ చైర్మన్‌ రాకముందే కో ఆప్షన్‌ సభ్యుల నియామకం కోసం ఎన్నిక మొదలు పెట్టారు.  ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్‌ చైర్మన్‌ టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతో కలిసి సమావేశానికి వచ్చారు. నా అధ్యక్షతన నిర్వహించాల్సిన ఎన్నిక నేను రాకుండానే ఎలా జరుపుతారని సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ను నిలదీశారు.  ఈక్రమంలో  ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి , మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు మధ్య మాటల యుద్ధం కొనసాగింది.  దీంతో ఎమ్మెల్యే మున్సిపల్‌ చైర్మన్‌ వీపుపై గట్టిగా కొట్టడంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్‌ ప్రథమ పౌరుడిపై ఎమ్మెల్యే చేయిచేసుకోవటాన్ని ఖండించారు. దీంతో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ మధ్య పెద్దఎత్తున మాటల యుద్ధం నడిచింది. లా అండ్‌ ఆర్డర్‌కు భంగం కలిగించినందున ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఎన్నికను వాయిదా వేయటానికి వీలులేదని,  నిర్వహించాల్సిందేనని ఎమ్మెల్యే పట్టుబట్టి సమావేశ మందిరంలోనే కూర్చున్నారు. నిబంధనల ప్రకారం చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేసినందున తిరిగి ఎన్నిక  నిర్వహించే అధికారం తమకు లేదని, ఎన్నిక  వాయి దా వేస్తున్నట్లు కమిషనర్‌ ప్రకటించారు. 

ఎమ్మెల్యే పీఏ పై అభ్యంతరం..

మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం మున్సిపల్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశానికి కౌన్సిలర్లను మాత్రమే అనుమతించారు. మీడియాను సైతం సమావేశానికి అనుమతించలేదు. టీఆర్‌ఎస్‌ నాయకులు సైతం గేటుబయటే ఉన్నారు.  కానీ అందరి కండ్లుకప్పిన ఎమ్మెల్యే పీఏ సతీశ్‌రెడ్డి ఏకంగా సమావేశ మందిరంలోకి వెళ్లారు. మున్సిపల్‌ చైర్మన్‌, ఎమ్మెల్యేకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో మున్సిపల్‌ చైర్మన్‌ మీదికి సతీశ్‌రెడ్డి కోపంగా దూసుకొచ్చారు. దీంతో విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యాలయం గేటు బయట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమను లోపలికి అనుమతించని పోలీసులు..ఎమ్మెల్యే పీఏను ఎలా అనుమతిస్తారని నిలదీశారు. దీంతో పోలీసులు అతన్ని సమావేశ మందిరం నుంచి బయటకు పంపించారు. 

 పోలీసుల  బందోబస్త్తు..

మున్సిపల్‌ కో ఆప్షన్‌ ఎన్నిక నేపథ్యంలో ఏసీపీ సత్తయ్య ఆధ్వర్యంలో సీఐ సీహెచ్‌ వెంకటయ్య బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచే మున్సిపల్‌ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికకు అనుమతి ఉన్నవారిని మాత్రమే సమావేశ మందిరంలోకి పంపించారు.  

 బీసీ వర్గానికి చెందిన వాడిననే దాడి 

  బీసీ వర్గానికి చెందిన వాడిననే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దాడిచేయడం సిగ్గుచేటని మున్సిపల్‌ చైర్మ న్‌ వెన్‌రెడ్డి రాజు అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో  ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్‌ కో ఆప్షన్‌ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే  రాజగోపాల్‌రెడ్డి రౌడీయిజం చేసి ప్రజాసామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. 20 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో 11మందితో కూడిన కోరం ఉంటేనే కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునే వీలుంటుందని తెలిపారు.  మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులను బెదిరించి  ఎన్నికలో నెగ్గాలని చూడటం సరైంది కాదన్నారు.  లా అండ్‌ ఆర్డర్‌ను దెబ్బతీయడం వల్లనే తప్పని పరిస్థితుల్లో ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు.  ఆయన వెంట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల శ్రీశైలంగౌడ్‌, కౌన్సిలర్లు ఎండీ బాబాషరీఫ్‌,  అంతటి విజయలక్ష్మీబాలరాజుగౌడ్‌, తాడూరి శిరీషాపరమేశ్‌, బొడిగె అరుణబాలకృష్ణగౌడ్‌, బత్తుల రాజ్యలక్ష్మీస్వామిగౌడ్‌, కొరగాని లింగస్వామి, దండ హిమబిందు అరుణ్‌కుమార్‌, గోపగోని లక్ష్మణ్‌గౌడ్‌, సుల్తాన్‌రాజు  ఉన్నారు.

ఎమ్మెల్యేకు షాకిచ్చిన టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌

టీఆర్‌ఎస్‌ అధిష్టానం వేసిన ఎత్తులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కంగుతిన్నారు.  సరైన సంఖ్యా బలం లేకపోవడంతో ఏకంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని తనవైపు తిప్పుకునేందుకు కుయుక్తులు పన్నారు. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అంతటి విజయలక్ష్మీబాలరాజుగౌడ్‌ను మభ్య పెట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించారు. కానీ తీరా ఓటింగ్‌ సమయానికి ఎమ్మెల్యేకు షాకిచ్చిన ఆమె తిరిగి టీఆర్‌ఎస్‌ పక్షానికి చేరుకుంది. అంతేకాకుండా మున్సిపల్‌ చైర్మన్‌ తనను తిట్టినట్టుగా ఫిర్యాదు రాసి సంతకం చేయాలని రాజగోపాల్‌రెడ్డి ఆమెను బలవంత పెట్టినా ఒప్పుకోలేదు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్‌ చైర్మన్‌కు వ్యతిరేకంగా పనిచేయనని తెగేసి చెప్పింది. అంతేకాకుండా ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ ప్రకటించడంతో ఆమె సైతం సమావేశం నుంచి బయటకు వచ్చింది.  


VIDEOS

logo