శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 07, 2020 , 23:51:05

అదనపు కలెక్టర్‌ రమేష్‌కు ఘన వీడ్కోలు

 అదనపు కలెక్టర్‌ రమేష్‌కు ఘన వీడ్కోలు

భువనగిరి కలెక్టరేట్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన రమేష్‌ బదిలీపై వెళ్లారు. కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగంలో బదిలీలు సాధారణమేనని, ప్రజా సమస్యల పరిష్కారంతోనే గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ కీమ్యానాయక్‌, ట్రైనీ కలెక్టర్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo