సోమవారం 01 మార్చి 2021
Yadadri - Aug 06, 2020 , 23:15:01

ప్రభుత్వ దవాఖానలో కరోనాకు వైద్యం

ప్రభుత్వ దవాఖానలో కరోనాకు వైద్యం

భువనగిరి కలెక్టరేట్‌ : ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా సోకిన వారికి అన్ని రకాల వైద్య సేవలందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించినట్లు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తెలిపారు. గురువారం మంత్రి, సీఎస్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. కరోనా బారినపడిన వారికి ప్రభుత్వ దవాఖానల్లో జాయిన్‌ చేసుకొని అన్ని రకాల సదుపాయాలు సమకూర్చాలని మంత్రి తెలిపారు. ప్రతి పీహెచ్‌సీలో కొవిడ్‌ బాధితులకు కావాల్సిన బెడ్స్‌, మెడిసిన్‌, హోం ఐసోలేషన్‌ కిట్‌, అంబులెన్స్‌, వెంటిలెటర్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌, టెస్టింగ్‌ సెంటర్‌ అందుబాటులో ఉంచాలని సూచించారు. పెషెంట్లను నిరంతరాయంగా సంప్రదించడం, పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే విధంగా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 200 యాక్టివ్‌ కేసుల్లో 46 మంది చికిత్స పొందుతుండగా, 154 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎయిమ్స్‌ను టెస్టింగ్‌ సెంటర్‌గా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కిమ్యా నాయక్‌, ట్రైనీ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, డీఎంహెచ్‌వో సాంబశివరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo