తెలంగాణ దిక్సూచి ప్రొఫెసర్ జయశంకర్‌సార్

ఆలేరు : 60 ఏండ్లు పరాయి పాలనలో నలిగిన రాష్ర్టానికి విముక్తిదారులు చూపిన దిక్సూచి ఆచార్య కొత్తపల్లి జయశంక ర్ సార్ అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆయన అడుగుజాడల్లో నడిచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడంతో పాటు బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్నారన్నారు. గురువారం జయశంకర్ జయంతి సందర్భంగా భువనగిరిలోని ప్రభుత్వ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కలెక్టరేట్లో..
భువనగిరి కలెక్టరేట్ : జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ అనితారామచంద్రన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జయశంకర్ సార్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, ట్రైనీకలెక్టర్ గరిమాఅగర్వాల్, పరిపాలనాధికారి శ్రీనివాస్‌చారి, సిబ్బంది పాల్గొన్నారు.
ఆలేరు టౌన్లో..
ఆలేరుటౌన్ : ఆలేరు పట్టణంలో ప్రభుత్వ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైల్వేగేటు సమీపంలోని టీఎన్జీవో కార్యాలయంలో ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకు ముందు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశం, డైరెక్టర్ గవ్వల నర్సింహులు, కొలనుపాక సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, కౌన్సిలర్లు రాయపురం నర్సింహులు, జూకంటి శ్రీకాంత్, కందుల శ్రీకాంత్, కోఆప్షన్ సభ్యులు సీస రాజేశ్, బ్యులారాణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సార్ సేవలు మరువలేనివి..
అడ్డగూడూరు : జయశంకర్‌సార్ సేవలు మరువలేవమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు.
భువనగిరిలో..
భువనగిరి : జిల్లా పరిషత్ కార్యాలయలో గురువారం ప్రొ. జయశంకర్‌సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్రంతోనే సమగ్రాభివృద్ధి జరుగుతుందని విశ్వసించి రాష్ట్ర సాధనకు దిక్సూచిలా జయశంకర్‌సార్ వ్యవహరించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో సీహెచ్ కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ బండారు యాదగిరి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరులో..
మోత్కూరు : తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త ప్రొపెసర్ జయశంకర్‌సార్ త్యాగం గొప్పదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో జయశంకర్‌సార్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిశోర్ ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తిపిరెడ్డి సావిత్రామేఘారెడ్డి, వైస్ చైర్మన్ వెంకటయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, మార్కెట్ వైస్ చైర్మన్ కొణతం యాకుబ్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు ఏంచేశారు?
- ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉంటయా?
- రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు
- లెక్కతప్పని తేలిస్తే ముక్కు నేలకురాస్తా
- నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- ప్రభుత్వం.. ఉద్యోగులది పేగుబంధం
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- సేవ చేస్తే శిక్ష రద్దు
- టీటా రాష్ట్ర కార్యదర్శిగా వెంకట్ వనం