కేసీఆర్ పాలనలో రైతులకు స్వర్ణయుగం

ఆత్మకూరు(ఎం) : ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగం పాలన సాగుతుందని, దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయలో ఆయన విలే కరులతో మాట్లాడారు. ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్నన్నారు. జిల్లా సహకార బ్యాంకు ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 107 సొసైటీలకు రూ.92కోట్లను 25 పైసల వడ్డీతో అందజేశామన్నారు. ఆలేరు నియోజకవర్గంలో 8 పీఏసీఎస్ సొసైటీలకు రూ.16 కోట్ల రుణాలు అందజేయగా, ఆత్మకూరు(ఎం) పీఏసీఎస్ సొసైటీ ద్వారా రైతులకు రూ.2కోట్ల పంట రుణాలు అందజేశామన్నారు. అదేవిధంగా నేడు వ్యక్తిగత రుణాలను రూ.10వేల నుంచి లక్ష రూపాయలకు పెంచామన్నారు. ఆత్మకూరు(ఎం) మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతోపాటు తాను కూడా నిరంతరం కృషి చేస్తామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు భాషబోయిన ఉప్పలయ్య, పంజాల వెంకటేశ్‌గౌడ్, యాస రంగారెడ్డి, సోలిపురం లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ యాస కవిత, టీఆర్ఎస్ జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి, కోరె భిక్షపతి, బీసు చందర్‌గౌడ్, పూర్ణచందర్‌రాజు, ధనలక్ష్మి, మండల నాయకులు అరుణ, శేఖర్, విజయ్, నరేందర్‌రెడ్డి, పల్లెర్ల సర్పంచ్ నర్సింహారెడ్డి, మల్లికార్జున్, నాగరాజు, రాజు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ సొసైటీగా గుండాలను తీర్చిదిద్దుతా..
గుండాల : రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ సహకారంతో సహ కార బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు అందించి దళారుల నుంచి రైతులకు రక్షణ కల్పిస్తున్నామని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సహకార బ్యాంకు డైరెక్టర్ల సమావేశం బ్యాంకు చైర్మన్ లింగాల భిక్షం అధ్యక్షతన జరిగింది. దీనికి గొంగిడి మహేందర్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ.. సహకార బ్యాంకుల ద్వారా రైతులకు 25 పైసల వడ్డీకి రుణాలను అందించి ఆదుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.92 కోట్లు రైతులకు రుణాల రూపంలో వారి ఖాతాల్లో జమ అయ్యాయన్నారు.ఆలేరు నియోజకవర్గంలోని 8 సొసైటీలకు రూ.16 కోట్ల రుణాలను రైతులకు అందించామన్నారు. జిల్లాలో 107 సొసైటీలు ఉన్నాయని అన్ని సొసైటీల ద్వారా రైతులకు తక్కువ వడ్డీతో పంట రుణాలను అందిస్తూ సహకార బ్యాంకులు అండగా నిలుస్తున్నాయన్నారు. గుండాల మండలంలోని సహకార సంఘం ద్వారా రైతులకు రూ.2 కోట్ల రుణాలు అందించామని ఇంకా రూ.2 కోట్ల రుణాలు అందించేందుకు సహకార బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. త్వరలోనే సహకార సంఘాల ఆర్థికాభివృద్ధికి రూ.2 కోట్లతో పెట్రోల్ బంకుతో పాటు వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభించి సహకార సంఘాల ఆర్థిక అభ్యున్నతి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సహకార బ్యాంకు వైస్ చైర్మన్ పురుగుల యాదలక్ష్మి, డైరెక్టర్లు మందడి రామకృష్ణారెడ్డి, జంపాల కొమురయ్య, బాల కొమురయ్య, శ్రీనివాస్, ఉప్పలయ్య, అంజయ్య, సాగర్‌రెడ్డి, సీవో నాగయ్య, పెంటమ్మ, బక్కయ్య, సువర్ణ, అయిలయ్య, సిబ్బంది హన్మంతు, సోమయ్య, మంగమ్మ, ప్రదీప్, మేనేజర్ బీరయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్