శుక్రవారం 30 అక్టోబర్ 2020
Yadadri - Aug 04, 2020 , 00:04:11

గిరాఖీ ఏది?

గిరాఖీ ఏది?

  • రక్షాబంధన్‌కు కరోనా దెబ్బ 
  • l    భారీగా తగ్గిన రాఖీల విక్రయాలు 
  • వెలవెలబోయిన మిఠాయి, ఇతర దుకాణాలు 
  • l    ఖాళీగా వెళ్లిన ఆర్టీసీ బస్సులు 

దుకాణాల వద్ద సందడి లేదు.. మిఠాయి షాపుల వద్ద బారులు లేవు.. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ లేదు. కరోనా విశ్వమారితో రాఖీ దుకాణాలు వెలవెలబోయాయి. ప్రతియేటా రూ.కోట్లలో జరగాల్సిన రాఖీల విక్రయాలు భారీగా పడిపోయాయి. దీని అనుబంధ మిఠాయిల అమ్మకాలను కరోనా కట్టడి చేసింది. ఏడాదిలో రాఖీ ఒక్కనాడే అమ్మకాలు బాగుండే ఈ దుకాణాల్లో సందడి కనిపించలేదు. వ్యక్తిగత వాహనాలకే ప్రాధాన్యమివ్వడంతో ఆర్టీసీ బస్సులు ఖాళీగా రాకపోకలు సాగించాయి. 

-యాదాద్రి,నమస్తేతెలంగాణ