ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్

సంస్థాన్‌నారాయణపురం : రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం అన్నలు, తమ్ముళ్లకు వారి సోదరీమణులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక హోమాలు, యజ్ఞాలు, గాయత్రిధారణ నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు చిలుకూరి అంజయ్య, సూరపల్లి కుచేలు, గుర్రం వెంకటేశం, యాదగిరి, లక్ష్మీనారాయణ, వంగరి రఘు తదితరులు పాల్గొన్నారు.
అడ్డగూడూరులో..
అడ్డగూడూరు: మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో రాఖీపౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రతీక అయిన రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని తమ సోదరులకు మహిళలు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు.
చౌటుప్పల్‌లో..
చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అక్క, చెల్లెలు ఎంతో ప్రేమతో అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది మహిళలు తాము ఇంట్లో తయారు చేసిన రాఖీలను కట్టడానికి ఇష్టపడ్డారు.
రామన్నపేటలో...
రామన్నపేట : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కాచెల్లెలు తమ అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. రాఖీ సందర్భంగా దుకాణాలు, స్వీట్‌షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. జనంపల్లి గ్రామం లో సర్పంచ్ రేఖ యాదయ్యకు ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిబలరాం రాఖీ కట్టి స్వీటు తినిపించారు.
ఆలేరు టౌన్లో..
ఆలేరు టౌన్ : రాఖీ పండుగను ఆలేరు పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉద యం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆడపడుచులు తమ అన్న,తమ్ముళ్లకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. 10వ వార్డు కౌన్సిలర్ కందుల శ్రీకాంత్‌కు చెల్లెలు శారద రాఖీ కట్టి కరోనా నివారణలో భాగంగా శానిటైజర్, మాస్కులు అందజేశారు.
మోటకొండూర్‌లో..
మోటకొండూర్ : మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో రాఖీ పండుగను సోమవారం ఘనంగా జరుపున్నారు.
ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్లు, అక్క తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక అయిన రక్షాబంధన్ వేడుకలను ఇంటింటా సంబురంగా నిర్వహించుకున్నారు. అన్నాతమ్ముళ్లకు అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టి హారతులు ఇచ్చారు. అనంతరం స్వీట్లు తినిపించుకున్నారు.
ఆలేరు రూరల్‌లో..
ఆలేరు రూరల్ : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్‌ను మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి హారతి ఇచ్చారు. రాఖీ కట్టిన అనంతరం చీరలు, కట్నాలు సమర్పించుకున్నారు.
తుర్కపల్లిలో..
తుర్కపల్లి : మండలంలోని వివిధ గ్రామాల్లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
అక్కచెల్లెళ్లు, అన్నాతమ్ములకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
బొమ్మలరామారంలో..
బొమ్మలరామారం : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రక్షాబంధన్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు.
భూదాన్‌పోచంపల్లిలో..
భూదాన్‌పోచంపల్లి : అన్నాచెల్లెళ్ల ఆప్యాయతకు ప్రతీక అయిన రక్షాబంధన్‌ను మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో కూడా తమ రక్తబంధమైన సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టి క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.
ఆత్మకూరు(ఎం)లో..
ఆత్మకూరు(ఎం) : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాలకు ప్రతీకైన రాఖీ పండుగను మండలంలోని గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకున్నారు. ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
మోత్కూరులో..
మోత్కూరు: రాఖీ పౌర్ణమి వేడుకలను మోత్కూరు మున్సిపాలిటీతోపాటు మండలంలోని పాటిమట్ల, దాచారం, అ నాజిపురం, పొడిచేడు, దత్తప్పగూడెం, పాలడుగు, పనకబండ, ముశిపట్ల, రాగిబావి, సదర్శాపురం గ్రామాల్లో ప్రజ లు అన్నా చెల్లెలు, అక్కాతమ్ముల్లు ఆత్మీయతను చాటుకున్నారు. కరోనాతో సోదరులకు సోదరీమణులు వాట్సా ప్ మెసేజ్‌లు, ఫోన్లలో శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
వలిగొండలో..
వలిగొండ : అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఉదయం వలిగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద రంగురంగుల రాఖీలను కొనుగోలు చేసిన సోదరీమణులు తమ సోదరులకు కట్టి స్వీట్లు తినిపించారు.
భువనగిరి అర్బన్‌లో..
భువనగిరి అర్బన్ : రాఖీ పండుగను పట్టణ ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ సోమవారం నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి 19వ వార్డు కౌన్సిలర్ వడిచెర్ల లక్ష్మీకృష్ణయాదవ్ రాఖీకట్టి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా పట్టణంలోని 10వ వార్డులో ముస్లిం మహిళలు హిందూ సోదరులకు రాఖీలు కట్టారు.
బీబీనగర్‌లో..
బీబీనగర్ : అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ఆత్మీయ అనుబంధాలకు చిహ్నంగా జరుపుకునే రాఖీ పండుగను పట్టణం, మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి మండల ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!