సోమవారం 21 సెప్టెంబర్ 2020
Yadadri - Aug 03, 2020 , 00:09:34

జిల్లాలో మోస్తరు వర్షం

 జిల్లాలో మోస్తరు వర్షం

భువనగిరి : జిల్లాలోని పలు మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. గుండాలలో 37మి.మీ, రాజాపేటలో 16.6 మి.మీ, భూదాన్‌ పోచంపల్లిలో 11.6మి.మీ, ఆలేరులో 10.8 మి.మీ, రామన్నపేటలో 99.6మి.మీ, తుర్కపల్లిలో 6.8 మి.మీ, యాదగిరిగుట్టలో 6.4మి.మీ, చౌటుప్పల్‌లో 2.8మి.మీ, ఆత్మకూర్‌(ఎం)లో 2.2మి.మీ, మోత్కూర్‌లో 1.6మి.మీ, బొమ్మలరామారంలో 0.8మి.మీ, బీబీనగర్‌లో 0.4 మి.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

యాదగిరిగుట్టలో...  

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదగిరిగుట్టలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండ దంచికొట్టింది. మధ్నాహ్యం 1:45 గంటల సమయంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని వర్షం ప్రారంభమైంది. సుమారు గంట పాటు వర్షం కురిసింది.  ఈ సారి పంటల సాగుకు అనుకూలంగా వర్షం కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


logo