మంగళవారం 27 అక్టోబర్ 2020
Yadadri - Aug 03, 2020 , 00:09:36

పులి కాదు..గ్రామ సింహం

పులి కాదు..గ్రామ సింహం

అసలే వానకాలం.. తిందామంటే తీరిక లేకుండా పొలం పనుల్లో నిమగ్నమైన రైతన్నలకు చెట్ల పొదల మధ్య ఒళ్లంతా మచ్చలతో సంచరిస్తున్న ఓ జంతువు కనిపించింది. చూసీ చూడంగానే రైతులంతా ‘బాబోయ్‌ పులి’ అని బెంబేలెత్తిపోయారు.  మళ్లీ ధైర్యాన్ని కూడదీసుకుని కాస్త ఆగి తీక్షణంగా పరిశీలించాక.. హమ్మయ్యా.. ఇది పులికాదు... ‘గ్రామ సింహం’ అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ కుక్క మండలంలోని శర్భనాపురంకొల్లూరు గ్రామాల శివారులోని వ్యవసాయబావుల వద్ద ఆదివారం కనిపించింది. 

- ఆలేరురూరల్‌


logo