శనివారం 08 ఆగస్టు 2020
Yadadri - Aug 02, 2020 , 00:08:22

రక్షణ కోట రాజాపేట

రక్షణ కోట  రాజాపేట

  • l   కోట లోపలే రాజాపేట గ్రామం 
  • l   ఏ సంస్థానాల్లోనూ కనిపించని వైవిధ్యం
  • l   కోట 52 ఎకరాలు.. చుట్టూ రాతి గోడలు 
  • l   ది గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ తెలంగాణగా ప్రసిద్ధి 
  • l   అద్భుత కళాసంపదతో నిర్మాణం 
  •  l   యాదాద్రికి 20 కి.మీ. దూరంలోనే చారిత్రక కోట
  • l   నాటి రాయన్నపేటే నేటి రాజాపేట

పాతతరానికి వైభవంగా, కొత్తతరానికి జ్ఞాపకంగా ఉంటోంది రాజాపేట కోట. అద్భుత కళా నైపుణ్యంతో రెండున్నర శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ కోట చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది. ఏ సంస్థానాల్లోనూ కనిపించని విధంగా కోట లోపలే రాజాపేట గ్రామం ఉంటుంది. గత వైభవానికి ప్రతీకగా కోట పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఇక్కడి శిల్పకళా సంపద అబ్బురం. ఎన్నో దండయాత్రలు, గెలుపోటముల గుర్తులను తనలో దాచుకున్న ఈ కోట నిజాం నవాబుల కాలంలో ప్రత్యేకంగా నిలిచింది. రాజకీయశక్తుల సమీకరణ, రాజ్య స్థాపనలో కీలకపాత్ర వహించింది. చుట్టుపక్కల వారు దీన్ని తెలంగాణ ఎర్రకోటగా పిలుస్తుంటారు. అంతేకాదు ఈ కోట గోడను ది గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ తెలంగాణగా చెప్పుకోవచ్చు. రాజాపేట కోట గురించి ఈ వారం సండే స్పెషల్‌..                                                                     

-రాజాపేట  


కోట విశేషాలివిగో 

విషయం       : రాజాపేట కోట 

నిర్మించింది :  1775 సంవత్సరంలో 

విస్తీర్ణం           : 52 ఎకరాలు 

విశేషాలు      : 12 మీటర్ల 

                              ఎత్తున రాతి గోడలు 

ఇంకా             : బురుజులు, సొరంగ

                             మార్గాలు, అద్దాల మేడ

ఎక్కడ            : యాదగిరిగుట్టకు 20 కిలోమీటర్ల దూరంలో..