ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Aug 02, 2020 , 00:08:38

నరసింహుడికి.. నిత్య పూజలు

  నరసింహుడికి.. నిత్య పూజలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి సంప్రదాయ పూజలు నిర్వహించారు. వేకువజామునే సుప్రభాత సేవ నిర్వహించి, అనంతరం అర్చనలు, అభిషేకం, పుష్పార్చన చేపట్టారు. మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు, శ్రీ సుదర్శన నారసింహ హోమం జరిపారు. ఆగమశాస్త్రం ప్రకారం స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖమంటపంలో ఊరేగించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయుడికి పూజలు జరిగాయి. రాత్రి వేళ స్వామి అమ్మవార్లకు మహా నివేదన చేసి శయనోత్సవం జరిపించారు. భక్తులు మాస్కులు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు.

రూ. 2.16 లక్షల ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ. 2,16,932 ఆదాయం వచ్చింది. ప్రసాద విక్రయాలతో రూ. 1,77,330, కొబ్బరికాయల ద్వారా రూ. 15,900, శాశ్వత పూజలతో రూ. 10,116,  వాహనపూజలతో రూ. 9,400, ప్రచారశాఖ నుంచి రూ. 1,550, మినీ బస్సుతో రూ.  1,320, ఇతర సేవల నుంచి రూ. 1,116, ప్రధాన బుకింగ్‌ నుంచి రూ. 200 ఆదాయం చేకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. 

VIDEOS

logo