మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Aug 02, 2020 , 00:08:36

అనాథ పిల్లలను ఆదుకుంటాం

 అనాథ పిల్లలను ఆదుకుంటాం

  • ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

ఆత్మకూరు(ఎం) : అనాథలైన పిల్లలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నా రు. మండల కేంద్రానికి చెందిన గట్టు సత్తయ్య - అనురాధ మృతి చెందడంతో వారి పిల్లలను శనివారం ప్రభుత్వ విప్‌ అక్కున చేర్చుకొని చలించిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల అమ్మమ్మ, తాత, మేనమామ ఒప్పుకుంటే ప్రభు త్వం తరపున పూర్తి బాధ్యతలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు తక్షణ సహాయంగా ఆర్థికసాయం అందజేసి, చైల్డ్‌ వెల్ఫేర్‌ సంస్థ నుంచి ఇద్దరు పిల్లలకు ప్రతి నెల రూ. 2000 వారి ఖాతాలోకి జమ చేసేలా ప్రొసీడింగ్‌ అందజేశారు. అదేవిధంగా చిన్నారుల పోషణ బాధ్యత తీసుకుంటానని నటుడు సోనూసూద్‌, నిర్మాత దిల్‌రాజు ప్రకటించడం అభినందనీయమన్నారు. 

VIDEOS

logo