మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jul 31, 2020 , 00:04:13

రైతు వేదికలు ఎంతో మేలు

రైతు వేదికలు ఎంతో మేలు

  • గ్రామాభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

బీబీనగర్‌: గ్రామాభివృద్ధికి చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ సూచించారు. బీబీనగర్‌ మండల కేంద్రంతోపాటు రాయరావుపేట్‌, పడమటిసోమారం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో గురువారం ఆమె ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న రైతు వేదికలతో పాటు పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.


అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతు వేదికలతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. రైతుల సమస్యలు, సమావేశాలు, ఇతర అంశాల చర్చలకు రైతు వేదిక భవనం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు, సందేహాలు ఉన్నా వ్యవసాయాధికారులు అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తారన్నారు. రైతు వేదికల నిర్మాణ పనులతోపాటు శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డు నిర్మాణాలు పారదర్శకంగా చేపట్టాలని, పనుల్లో నాణ్యతా లోపం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పనులు వేగవంతం చేయాలని తెలిపారు. అలాగే పల్లె ప్రకృతివనాల ఏర్పాటు వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఆమె వెంట ట్రైనీ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, అసిస్టెంట్‌ పీడీ శ్యామల, ఎంపీడీవో శ్రీవాణి, పీఆర్‌ఏఈ నర్సింహారెడ్డి, ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌, సర్పంచులు మల్లగారి భాగ్యలక్ష్మిశ్రీనివాస్‌, బొర్ర సంతోషారమేశ్‌, తలబోయిన గణేశ్‌యాదవ్‌, సురకంటి సత్తిరెడ్డి, ఎంపీటీసీ యర్కల విజయలక్ష్మీపాండురంగం గౌడ్‌, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

VIDEOS

logo